జాతీయ వార్తలు

3.7శాతం తగ్గిన ఎటిఎఫ్ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: దేశంలో గురువారం ఒకవైపు విమానాలలో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఎటిఎఫ్) ధర తగ్గగా, సామాన్య జనం సహా అధిక సంఖ్యలో ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువు అయిన సబ్సిడీ వంటగ్యాస్ (ఎల్‌పిజి) ధర పెరిగింది. ఎటిఎఫ్ ధర 3.7 శాతం తగ్గగా, సబ్సిడీపై అందజేసే ఎల్‌పిజి ధర సిలిండర్‌కు రూ. 2.07 శాతం చొప్పున పెరిగింది. సబ్సిడీ వంట గ్యాస్ ధర పెరగడం గత ఆరు నెలల్లో ఇది వరుసగా ఏడోసారి. ఎటిఎఫ్ ధర కిలో లీటరుకు రూ. 1,881 చొప్పున తగ్గింది. అంటే 3.7 శాతం తగ్గింది. తగ్గిన తరువాత ఢిల్లీలో దీని ధర కిలో లీటరుకు రూ. 48,380గా ఉంది. రెండుసార్లు పెరిగిన ఎటిఎఫ్ ధర ఈసారి తగ్గింది. గత నెల ఒకటో తేదీన దీని ధర 7.3 శాతం పెరిగింది. అయితే 14.2 కిలోగ్రాముల సిలిండర్‌కు గతంలో రూ. 430.64గా ఉన్న వంట గ్యాస్ ధర ఇప్పుడు రూ. 432.71కి పెరిగింది. వంట గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని క్రమంగా తొలగించడానికి ప్రతి నెల ఒక్కో సిలిండర్‌పై రూ. 2 చొప్పున ధర పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తరువాత జూలై నుంచి దీని ధర పెరగడం ఇది వరుసగా ఏడోసారి. దీని ధర నవంబర్ ఒకటిన ఒక్కో సిలిండర్‌పై రూ. 2.05 చొప్పున పెరిగింది. అంతకుముందు అక్టోబర్ 28న ఒక్కో సిలిండర్‌పై రూ. 1.5 చొప్పున ధర పెరిగింది. డీలర్లకు చెల్లించే కమీషన్‌ను పెంచడానికి అప్పుడు దీని ధరను పెంచారు. అక్టోబర్ ఒకటిన దీని ధరను ఒక సిలిండర్‌పై రూ. 2.03 చొప్పున పెంచారు.
కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీని కూడా తొలగించడానికి ప్రభుత్వం ప్రతి పక్షం రోజులకు ఒక లీటర్‌పై 25 పైసల చొప్పున ధర పెంచాలని నిర్ణయించింది. దీని ప్రకారం కిరోసిన్ ధర కూడా జూలై నుంచి వరుసగా తొమ్మిదోసారి గురువారం పెరిగింది. ఇప్పుడు ముంబయిలో లీటర్ కిరోసిన్ ధర రూ. 17.51కి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీని కిరోసిన్ వినియోగించని రాష్ట్రంగా ఇప్పటికే ప్రకటించారు.