జాతీయ వార్తలు

సత్వర న్యాయానికి సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: లోక్ అదాలత్‌ల వల్ల సామాన్యులకు ఖర్చులేని సత్వర న్యాయం అందడం తోపాటు న్యాయ స్థానాలపై ఒత్తిడి తగ్గుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూ ర్ వెల్లడించారు. అఖిల భారత న్యాయ సేవాధికార సంస్థ 14వ జాతీయ సదస్సు శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయ సహాయం అందించడంలో లోక్ అదాలత్ కీలక భూమిక పోషిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో మూడు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, న్యాయమూర్తుల కొరత కూడా కేసుల పరిష్కారంపై ప్రభావం చూపుతోందన్నారు. దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ప్రస్తుతం 450 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలో మరో 50 పోస్టులు ఖాళీ అవుతున్నాయన్నారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని చెబుతూనే, నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ వివాదం
వల్ల 160 మంది న్యాయమూర్తుల నియామకం నిలిచిపోయందని వివరించారు. ఇటీవలే 90మంది న్యాయమూర్తుల నియామకం ప్రక్రియ పూర్తి చేశామని, ప్రక్రియ వేగవంతానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కృషి చేస్తున్నారన్నారు. పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్, పెండింగ్ కేసుల పెరుగుదల వాస్తవమేనన్నారు. న్యాయం పౌరుల ప్రాథమిక హక్కేనని, అయతే కేసుల ఆలస్యం వల్ల న్యాయం లభించడం లేదనే భావన ఉందన్నారు. న్యాయ వ్యవస్థ ఒత్తిడిలో ఉందని, ప్రతి పౌరుడికి రాజ్యాంగం ప్రకారం న్యాయం పొందే హక్కు ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న కోట్లాది కేసులను పరిష్కరించడానికి కేంద్రం తగిన సహకారం అందించాలని కోరారు. హైకోర్టుల్లో ఉన్న న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి తగిన చర్యలు అవసరమన్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై అనుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు.
దేశంలో అసంఘటిత రంగంలో 46 కోట్ల మంది కార్మికులున్నారని, వీరిలో 14 కోట్ల మంది మహిళా కార్మికులున్నారన్నారు. వీరికి న్యాయస్థానాల నుంచి, లోక్ అదాలత్ నుంచి న్యాయం లభించడం లేదని, అదే విధంగా ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు వందల ఖాళీలు ఉన్న పరిస్థితుల్లో లోక్ అదాలత్ ద్వారానే సత్వర న్యాయం సాధ్యమన్నారు. కిందిస్థాయి వరకు న్యాయ సేవల గురించి అవగాహన కలిగేట్టు చేయాలని సూచించారు. పేదలకు న్యాయవ్యవస్థపై అవగాహన కలగాలని, విద్యారంగం ద్వారా ఈ పని జరగాలన్నారు. హర్యానా, గుజరాత్‌లలో ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ యాప్‌ను సుప్రీంకోర్టు సిజె ఠాకూర్ ఆవిష్కరించారు. న్యాయం కోసం వచ్చే గిరిజనులకు అండగా నిలవాలని న్యాయవాదులను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ ఆర్ దవే కోరారు. ఏడాది కాలంలో లోక్ అదాలత్‌ల ద్వారా 62 లక్షల కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. సింగరేణి కాలరీస్‌కు చెందిన భూవివాదాలు పరిష్కరించినందుకు ఆ సంస్థ చైర్మన్, ఎండి 57 కోట్ల రూపాయల చెక్కును అనిల్ ఆర్ దవేకు అందించారు.
జైళ్లలో విచారణ ఖైదీలే ఎక్కువ: సదానంద గౌడ
జైళ్లలోని ఖైదీల్లో రెండింట మూడొంతుల మంది విచారణ ఖైదీలే ఉన్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. సత్వర న్యాయం కోసం వీరు ఎదురు చూస్తున్నారన్నారు. వీరికి న్యాయం జరగాలని, వారి జీవితాలు విచారణలోనే ముగిసిపోకూడదన్నారు. కేసుల సత్వర పరిష్కారం కోసం, అవసరమైన సదుపాయాల కోసం, శిక్షణ కోసం 140 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు.

chitram అఖిల భారత న్యాయ సేవాధికార సంస్థ 14వ జాతీయ సదస్సులో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సుప్రీంకోర్టు సిజె ఠాకూర్. చిత్రంలో కేంద్ర న్యాయమంత్రి గౌడ, తెలంగాణ సిఎం కెసిఆర్ తదితరులు