జాతీయ వార్తలు

తమిళనాడు, పుదుచ్చేరిలకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/ కడలూరు, డిసెంబర్ 1: నాడా తుపాను గురువారం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారడంతో తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలకు కొంత ఊరట కలిగింది. ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం తెల్లవారు జామున కడలూరు, వేదారణ్యం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రాంతీయ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ ఎ.బాలచంద్రన్ గురువారం చెన్నైలో విలేఖరులకు తెలిపారు. నాడా తుపాను ముంచుకొస్తోందని ఇప్పటికే పాలనా యంత్రాంగాన్ని హైఅలర్ట్ చేసిన అధికారులకు తుపాను బలహీనపడటం కొంత ఊరటనిస్తోంది. అధికారులు ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌లను మోహరించి ఉంచారు. విస్తృత స్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అంతకుముందు నాడా తుపాను కడలూరు వద్ద తమిళనాడును తాకుతుందని, దీని ప్రభావం వల్ల రాష్ట్రంతోపాటు పొరుగున ఉన్న పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కార్యాలయం ప్రకటించింది. అయితే బలహీనపడిన తుపాను తీవ్ర వాయుగుండంగా పుదుచ్చేరికి ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని బాలచంద్రన్ తెలిపారు. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ తీరాన్ని తాకుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని, ఇవి కొనసాగుతాయని ఆయన వివరించారు. కొన్ని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.