జాతీయ వార్తలు

కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురయిన మరుసటి రోజే ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను కూడా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి)కు చెందిన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన వ్యక్తులు దానిలో కొన్ని అభ్యంతరకరమైన ట్వీట్లు పోస్ట్ చేశారని కాంగ్రెస్ గురువారం పేర్కొంది. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాలో ఎనిమిది అభ్యంతరకరమైన ట్వీట్లు వచ్చాయి. దీంతో పాటే ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌ను మార్చి ఆ స్థానంలో అభ్యంతరకరమైన ఫోటోను ఉంచారు. గురువారం మరోసారి రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసినట్లు పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ దీనిపై గురువారం ఢిల్లీ పోలీసు సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు కూడా చేసింది. దీంతో ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులతోపాటుగా ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కూడా దర్యాప్తు చేపట్టాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, తక్షణం చర్య తీసుకుంటున్నామని కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి వారం రోజులుగా ఆ ట్విట్టర్ ఖాతాను లాగాన్ చేసిన వారందరి వివరాలను తీసుకుంటున్నామని కూడా ఆయన చెప్పారు. కాగా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతాల హ్యాకింగ్ వెనుక ఫాసిస్టు శక్తుల హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపిస్తూ, అసహన సంస్కృతి ఎంతగా పెరిగిపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనమని, ఇలాంటి విద్వేషపూరిత ధోరణులపై పార్టీ గతంలో గాంధేయ సిద్ధాంతాలయిన ప్రేమ, సహనంతోనే పోరాటం చేసిందని అన్నారు. అంతేకాదు, దేశంలో సైబర్ సెక్యూరిటీ బలహీనతలను ఈ ఉదంతం బట్టబయలు చేసిందని కూడా ఆయన చెప్పారు. పార్టీ వెబ్‌సైట్, అలాగే కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఇ-మెయిల్ ఖాతాలను హ్యాక్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ గురువారం ఉదయం ఢిల్లీ పోలీసు సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేసింది. హ్యాకింగ్ వెనుక ఉన్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సుర్జేవాలా దాఖలు చేసిన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.