జాతీయ వార్తలు

ఎంపీలతో మోదీ మాటామంతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వాడివేడిగా ఉంటున్న రాజ్యసభ గురువారం కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. సభ వాయిదాపడిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ 15 నిముషాలసేపు సభలోనే ఉండి ఎంపీలతో పిచ్చాపాటీ మాట్లాడుతూ కనిపించారు. ప్రతిపక్ష పార్టీల సభ్యులను పలకరిస్తూ వారితో మాట్లాడుతూ గడిపారు. పెద్దనోట్ల రద్దుపై జరిగే చర్చకు ప్రధాని మోదీ రావాలని 14 రోజులుగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రాజ్యసభ జిరో అవర్‌కు ముందు అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో మోదీ సభకు వచ్చారు. తరువాత సభ 15 నిముషాల పాటు అంటే 12.30కు వాయిదా పడింది. ఆ సమయంలో మోదీ తన సీట్లోనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఎక్కువమంది సీట్లలోనే కనిపించారు. బాలీవుడ్ నటి, ఎంపీ జయాబచ్చన్ ప్రధాని మోదీ వద్దకు వచ్చి కరచాలనం చేశారు. ఆమెతోపాటు అన్నాడిఎంకె సభ్యులు, లెఫ్ట్ పార్టీల ఎంపీలు ఉన్నారు. ప్రముఖ బాక్సర్, ఎంపీ మేరీకోమ్ ప్రధానిని కలిసి పలు అంశాలపై మాట్లాడడం కనిపించింది. ప్రధాని మోదీ చిరునవ్వులు చిందిస్తూ ఎంపీలను పలకించారు.