జాతీయ వార్తలు

పెద్దనోట్ల రద్దు మంచిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యను ప్రముఖ ప్రొఫెషనల్ రెజిలర్ కాళీ గట్టిగా సమర్థించారు. గ్రేట్ కాళీగానే అందరికీ బాగా తెలిసిన దలీప్ సింగ్ రాణా గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దు దీర్ఘకాలంలో దేశానికి మేలు చేస్తుందని చెప్పారు. మొదట్లో ఇది ప్రజలకు కొంత ఇబ్బంది కలుగజేసినా చివరికి దేశానికి మేలు చేస్తుందని అన్నారు. ఇదే విషయాన్ని తాను ప్రధానికి చెప్పానని, ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానిని అభినందించడానికి ఆయనను కలిసినట్లు వరల్డ్ రెజిలింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న కాళీ చెప్పారు.