జాతీయ వార్తలు

కోర్టుల్లోనూ రాజకీయాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: కోర్టులు రాజకీయాలకు వేదికగా మారడం సమంజసం కాదని సుప్రీంకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ఒక రాజకీయ పార్టీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయవచ్చా, అనుసరించవచ్చా అనే అంశంపై వాదనల సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘దీనివల్ల రాజకీయాలు కోర్టులకు మళ్లుతాయనే భయాలున్నాయి. మాకు ఇది ఇష్టం లేదు. రాజకీయాలు కోర్టులకు మారాలని మేము కోరుకోవడం లేదు’ అని న్యాయమూర్తులు మదన్ బి లోకుర్, ఎన్‌వి రమణలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఏదయినా ఒక రాజకీయ పార్టీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పిటిషన్ దాఖలు చేస్తే కోర్టులు దాన్ని విచారించవచ్చని దేశంలోని 12 కరవు పీడిత రాష్ట్రాల్లో రైతుల కష్టాలపైన పిల్ దాఖలు చేసిన ‘స్వరాజ్ అభియాన్’ అనే ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ అన్నప్పుడు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
ఒక రాజకీయ పార్టీగా కాకపోయినా రాజకీయ పార్టీ విభాగంగా కొనసాగాలన్న తన ఉద్దేశాన్ని ఆ స్వచ్ఛంద సంస్థ స్పష్టం చేసిందని, అందువల్ల ఆ సంస్థకు ఈ పిల్ వేసే అర్హత లేదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అనడంతో ఈ చర్చ తలెత్తింది. ఒక రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేసుకోవడానికి ‘స్వరాజ్ ఇండియా’ దాఖలు చేసుకున్న పిటిషన్ ఎన్నికల కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉందని వాదనల సందర్భంగా రోహత్గీ చెప్పారు. అయితే స్వరాజ్ అభియాన్, స్వరాజ్ ఇండియా రెండూ వేర్వేరు సంస్థలని, స్వరాజ్ అభియాన్ రాజకీయ పార్టీ కాదని ప్రశాంత్ భూషణ్ అన్నారు. అంతేకాదు, ఒక రాజకీయ పార్టీ లేవనెత్తిన అంశం ప్రజా ప్రయోజనానికి చెందిన అంశమా కాదా అనేది ముఖ్యమని, స్వరాజ్ అభియాన్‌కు రాజకీయ ప్రయోజనాలు లేవని ఆయన అన్నారు. ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశాన్ని లేవనెత్తే పిటిషన్‌ను రాజకీయ పార్టీ దాఖలు చేసినప్పుడు, దానిద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ఉద్దేశం లేనప్పుడు కోర్టులు ఆ పిటిషన్‌ను విచారించాలని కూడా ప్రశాంత్ భూషణ్ అన్నారు. అయితే ఇది ప్రజా ప్రయోజనం కలిగినది, ఇది కాదని కోర్టు ఎలా వేరు చేస్తుందని బెంచ్ ప్రశ్నించింది. అయితే రాజకీయ పార్టీకి చెందిన ఏ చర్యనైనా అది ప్రజా ప్రయోజనానికి చెందినదయితే దాన్ని అభినందించాలని, కాకపోతే కోర్టులు ఆ పిటిషన్‌ను కొట్టివేయవచ్చని ప్రశాంత్ భూషణ్ అన్నారు.