జాతీయ వార్తలు

ఉద్రిక్తతల మధ్య చర్చలు అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1:ఉగ్రవాద దాడుల మధ్య ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని పాకిస్తాన్‌కు భారత్ తెగేసి చెప్పింది.కాశ్మీర్‌లోని నగ్రొటా సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరింత కటువుగా తన స్వరాన్ని పాక్‌కు వినిపించింది. ఇలాంటి అవాంఛనీయ, ఉద్రిక్త, ఉగ్రవాదమయ పరిస్థితులను ఎంత మాత్రం అంగీకరించేది లేదని, అలాగే వీటి మధ్య ద్వైపాక్షిక చర్చలకూ ఆస్కారం ఉండదని భారత విదేశాంగ విభాగం ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పష్టం చేశారు. నగ్రొటా దాడికి సంబంధించి అన్ని వివరాలనూ సేకరిస్తున్నామని, వాటిని పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంఘటనను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని, దేశ భద్రతకు అవసరమైన చర్యలను కచ్చితంగా తీసుకుంటుందని ఆయన ఉద్ఘాటించారు. అమృతసర్‌లో మూడు, నాలుగో తేదీల్లో జరుగనున్న హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు సందర్భంగా పాక్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా ‘పాకిస్తాన్ నుంచి ఇందుకు సంబంధించి ఎలాంటి అభ్యర్థన అందలేదు’అని వికాస్ స్వరూప్ తెలిపారు. పాక్‌కు చర్చలకు భారత్ సిద్ధంగా ఉన్నా..అందుకు అన్ని విధాలుగా అనువైన పరిస్థితులు ఉండాల్సిందేనని చెప్పారు.