జాతీయ వార్తలు

ఓటింగ్ జరగాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఓటింగ్‌తో కూడిన చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన నినాదాలతో శుక్రవారం లోక్‌సభ దద్దరిల్లిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని దుర్వినియోగం చేస్తోందటూ ప్రతిపక్షాలు ఈరోజు లోక్‌సభను స్తంభింపజేశారు.
ప్రతిపక్షాలు సృష్టించిన గొడవ మూలంగా లోక్‌సభ కేవలం ఒక గంటా పదిహేను నిమిషాల పాటు గందరగోళంలో కొనసాగింది. ప్రతిపక్షం సృష్టించిన గందరగోళం మూలంగా లోక్‌సభ ఈరోజు కూడా మధ్యాహ్నం పనె్నండున్నరకే సోమవారానికి వాయిదా పడింది. లోక్‌సభ శుక్రవారం ఉదయం సమావేశమైన అనంతరం స్పీకర్ తృణమూల్ కాంగ్రెస్ పక్షం నాయకుడు సుదీప్ బందోపాధ్యాయకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. కోల్‌కతాలో నిన్న సైన్యం అకస్మాత్తుగా టోల్‌ప్లాజాలను తమ అదుపులోకి తీసుకుందని, ఎందుకిలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. మమతా బెనర్జీ కార్యాలయం ఉన్న రాష్ట్ర సచివాలయాన్ని సైన్యం చుట్టుముట్టిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని పంతొమ్మిది ప్రాంతాల్లో సైన్యం మోహరింపు జరిగిందని బందోపాధ్యాయ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల అనుమతి తీసుకోకుండా సైన్యం మోహరింపు ఎలా జరిగిందని ఆయ న ప్రశ్నించారు. కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే టిఎంసి వాదనను బలపరిచారు. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ సైన్యం రెగ్యులర్ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్థానిక పోలీసులతో చర్చించిన తరువాతనే సైన్యం ఈ కార్యక్రమం నిర్వహించింది, ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం, ఈశాన్య రాష్ట్రాలలో కూడా కొనసాగుతోందన్నారు. సైనిక కార్యకలాపాలను రాజకీయం చేయవద్దని స్పష్టం చేశారు. టిఎంసి నిరాశా నిస్పృహలతో ఈవిధంగా చేస్తోందని పారికర్ దుయ్యబట్టారు. అయితే బందోపాధ్యాయ మాత్రం ఇదేదీ పట్టించుకోకుండా సైన్యం ఎందుకిలా చేస్తోందంటూ విమర్శలకు దిగారు. సుమిత్రా మహాజన్ ఈ దశలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుపడినా స్పీకర్ సుమిత్రా మహాజన్ దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగినంత సేపు కాంగ్రెస్, టిఎంసి, వామపక్ష సభ్యులు పోడి యం వద్ద నిలబడి ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడంతో లోక్‌సభ దద్దరిల్లిపోయింది. ప్రతిపక్ష సభ్యులకు నచ్చజెప్పేందుకు సుమిత్రా మహాజన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ గందరగోళం మధ్యనే దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించిన అనంతరం సభను పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు.
లోక్‌సభ తిరిగి సమావేశం కాగానే ఆమె ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పించేసిన అనంతరం సావధాన తీర్మానాలపై చర్చ చేపట్టారు. పదిహేనుమంది సభ్యులు తమ సావధాన తీర్మానాలపై మాట్లాడారు. ఇదంతా ప్రతిపక్షం సభ్యుల నినాదాల గొడవ మధ్య కొనసాగటం గమనార్హం. దాదాపు అర్ధగంట పాటు కార్యక్రమం కొనసాగిన అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను సోమవారం ఉదయం వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు.

చిత్రం..ఓటింగ్‌తో కూడిన చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు
ఇచ్చిన నినాదాలతో శుక్రవారం దద్దరిల్లిపోయన లోక్‌సభ