జాతీయ వార్తలు

బలగం తక్కువైనా సామర్థ్యం ఎక్కువే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, డిసెంబర్ 2: నౌకాదళంలో సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమేనని, అయితే సామర్థ్యంపై దాని ప్రభావం ఎంతమాత్రం లేదని సదరన్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ ఎ.ఆర్.కావే స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు నావికా దళాలు సన్నద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో నావికా దళాల్లో సిబ్బంది కొరతను తీర్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని, నియామకాలతో పాటు వివిధ శిక్షణా సంస్థలనుండి సిబ్బందిని తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కావే తెలిపారు. ఒకపక్క కొరతతో సతమతమవుతున్నా నావికాదళ సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ఎలాంటి సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొంటామని వెల్లడించారు. నేవీ వారోత్సవాల సందర్భంగా దక్షిణ జెట్టీలోని ఐఎన్‌ఎస్ తిర్‌లో విలేఖరులతో మాట్లాడారు. నావల్ అకాడమీల సంఖ్య పెరిగిన పక్షంలో సిబ్బంది కొరత తీరినట్లేనని, మరో రెండేళ్లలో ఇది కొలిక్కి వస్తుందని తెలిపారు. కాగా, నావికాదళంలో ప్రస్తుతం లక్షమంది ఉన్నారని రక్షణ శాఖ వర్గాల సమాచారం. వీరిలో 69వేలమంది యూనిఫాం సిబ్బంది ఉన్నారు. వీరిలో 21 శాతం మేరకు కొరత ఉండగా, నావికుల్లో 18 శాతంగా ఉంది.