జాతీయ వార్తలు

దూసుకొస్తున్న తోకచుక్కలు భూమికి సమీపంగా వచ్చే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: భూమికి సమీపంగా ఇటీవల గ్రహశకలాలు దూసుకుపోయి ఆందోళన రేకెత్తించిన నేపథ్యంలో మరో రెండు తోకచుక్కలు అతిసమీపంగా పుడమిని దాటుకుని వెళ్లపోతున్నాయి. ఇది ఖగోళపరంగా అత్యంత అరుదైన సంఘటనేనని చెబుతున్న ఖగోళవేత్తలు, ఈ రెండు తోకచుక్కలు జూపిటర్ కుటుంబానికి చెందినవేనని, అతి స్వల్ప వ్యవధిలో భూమికి సమీపంగా దూసుకుపోతున్నాయని వెల్లడించారు. 252పి, పి/2016బిఏ14 అనే ఈ రెండు తోకచ్చుకలు ఒకే పరిభ్రమణ గతిని కలిగివున్నాయని ఖగోళవేత్తలు తెలిపారు. ఈ పరిణామాన్ని లోతుగా పరిశీలిస్తే తోకచుక్కల అంతర్గత నిర్మాణం గురించి మరింతగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెబుతున్నారు. వీటిలో 252పి అనే తోకచుక్క పరిమాణం 750 అడుగుల మేర ఉంటుందని, ఇది సోమవారం భూమికి 5.2 మిలియన్ కిలోమీటర్ల దూరంలో దూసుకుపోయే అవకాశం ఉందని వెల్లడించారు. 2016బిఏ తోకచుక్క మంగళవారం భూమికి 3.5 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి దాటుకువెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో భూమికి ఇంత సమీపంగా తోకచుక్కలు దూసుకెళ్లడం అన్నది ఇది మూడో ఘటన అని వెల్లడించారు. 1770లో ఒకసారి, 1983లో ఒకసారి ఈ తరహా పరిణామాలు జరిగినట్లు చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వివరాలను బట్టి ఈ రెండు తోకచుక్కలు అంతర్గహ కవలలని, వీటిలో చిన్న తోకచుక్క పెద్ద తోకచుక్క విడిపోవడం వలన ఏర్పడినదేనని తెలుస్తోంది.