జాతీయ వార్తలు

సుజనాచౌదరిని తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏ కొద్ది నిజాయితీ ఉన్నా సైన్స్, సాంకేతిక విజానం శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరిని మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ డిమాండ్ చేశారు. తివారీ శనివారం ఏఐసిసి కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మారిషస్‌లోని ఒక వాణిజ్య బ్యాంకును దురుద్దేశంతో మోసం చేయటంతోపాటు చట్టంనుండి తప్పించుకుని పారిపోతున్న సుజనా చౌదరిని మంత్రివర్గంలో ఎలా కొనసాగిస్తున్నారని ప్రధాన మంత్రిని ప్రశ్నించారు. తినను, తిననీయనంటూ 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు చేసిన ప్రకటన ఏమైందని ఆయన నిలదీశారు. మోదీ గత రెండేళ్లలో ఎంతో మారిపోయారు. తినను తిననీయనని ప్రకటించిన మోదీ ఇప్పుడు 3దోచుకు తినండి2 అనే విధానాన్ని అనుసరిస్తున్నారని తివారీ ఆరోపించారు. తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ఒక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసిన తరువాత కూడా సుజనా చౌదరిని మీరు కేంద్ర మంత్రివర్గంలో ఎలా కొనసాగనిస్తున్నారని నిలదీశారు. నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినందున సుజనా చౌదరి మంత్రి పదవికి తనంత తాను రాజీనామా చేయాలి లేదా మోదీ అతన్ని వెంటనే మంత్రివర్గం నుండి తొలగించాలని మనీష్ తివారీ డిమాండ్ చేశారు. సుజనా చౌదరిని అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశాలు జారీచేసిన తరువాత కూడా అతన్ని మంత్రివర్గంలో కొనసాగించటం వెనుక ఉన్న రహహ్యం ఏమిటని తివారీ ప్రశ్నించారు.
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్పను రాష్ట్ర శాఖ బిజెపి అధ్యక్షుడిగా నియమించటాన్ని కూడా మనీష్ తివారీ తప్పుపట్టారు. కర్నాటక లోకాయుక్త తప్పుపట్టిన వ్యక్తిని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా నియమితుడైన వౌర్యపై పది క్రిమినల్ కేసులున్నాయని తివారీ తెలిపారు. కాగా, పనామా పేపర్లపై ప్రభుత్వం నిర్వహిస్తున్న దర్యాప్తునకు విశ్వసనీయత లేదని ప్రత్యక దర్యాప్తు బృందం (సిట్)ద్వారానే విచారణ చేయంచాలని తివారీ డిమాండ్ చేశారు.