జాతీయ వార్తలు

సిబిఐ కొత్త చీఫ్‌గా ఆస్థానా బాధ్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) డైరెక్టర్ పదవి నుంచి అనిల్ సిన్హా శుక్రవారం పదవీ విరమణ పొందారు. దీంతో ఆయన తరువాతి స్థానంలో ఉన్న గుజరాత్ కేడర్ 1984 బ్యాచ్ ఐపిఎస్ అధికారి రాకేష్ ఆస్థానా కొత్త చీఫ్‌గా ఆ బాధ్యతలను చేపట్టారు. సిబిఐకి తదుపరి పూర్తిస్థాయి డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం ఎవరినీ ఎంపిక చేయకపోవడంతో ఆస్థానా ఈ బాధ్యతలు చేపట్టారు. సిబిఐ డైరెక్టర్ పదవి కోసం రేసులో ఉన్న ఆశావహుల్లో అందరికంటే ముందున్న ప్రత్యేక డైరెక్టర్ ఆర్‌కె.దత్తా ఇటీవల కేంద్ర హోం శాఖకు రెండవ ప్రత్యేక కార్యదర్శి పదవికి బదిలీ కావడంతో రాకేష్ ఆస్థానాకు రెండు రోజుల క్రితం సిబిఐలో సెకెండ్ ఇన్ కమాండ్‌గా పదోన్నతి కల్పించారు. హోం శాఖలో రెండవ ప్రత్యేక కార్యదర్శి పదవిని సృష్టించడం ఇదే తొలిసారి కాగా, పదవీ విరమణ పొందిన సిబిఐ డైరెక్టర్ స్థానంలో కొత్త చీఫ్‌గా ఎవరినీ ఎంపిక చేయకపోవడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి.