జాతీయ వార్తలు

అవుట్‌లుక్ సర్వేలో టాప్ వర్శిటీగా హెచ్‌సియు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: వివాదాలతో అట్టుడికి పోతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ దేశంలోనే మరో మారు అత్యుత్తమ వర్శిటీగా ఎంపికైంది. అవుట్‌లుక్ పత్రిక నిర్వహించిన సర్వేలో 826 యూనివర్శిటీలు పాల్గొనగా, అందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఏడో స్థానంలో నిలిచి విశిష్ఠ విశ్వవిద్యాలయంగా ఎంపికైంది. తొలి స్థానంలో బెంగళూరు ఐఐఎస్‌సి ఉండగా, రెండో స్థానంలో ఐఐటి ముంబయి, మూడో స్థానంలో ఐఐటి ఖరగ్‌పూర్, నాలుగో స్థానంలో ఐఐటి చెన్నై, ఐదో స్థానంలో ఐఐటి ఢిల్లీ, ఆరో స్థానంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబయి నిలిచాయి. ఏడో స్థానంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఎంపికైంది. దాదాపు 150 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పోటీ పడినా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ తన విశిష్ఠతను కాపాడుకుంది.