జాతీయ వార్తలు

సైన్యం రిక్రూట్‌మెంట్‌కు ఇక రాతపరీక్ష తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 3: సైన్యంలో వివిధ కేటగిరిల్లో సవరించిన నిబంధల ప్రకారం సిపాయిల నియామకానికి శ్రీకారం చుట్టారు. జవాన్ల నియామకంలో శారీరక పరీక్షలే కాకుడా రాత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే తదుపరి పరీక్షలకు పిలుస్తారు. సైన్యంలో తీసుకురాదలిచిన సంస్కరణకు సంబంధించి ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉందని ఆర్మీ రిక్రూట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ జెకె మర్వాల్ శనివారం వెల్లడించారు. సైన్యంలో చేరాలనుకున్న అభ్యర్థి ముందుగా రాతపరీక్ష రాయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. దానిలో ఉత్తీర్ణుడైతేనే తదుపరి పరీక్షలకు పిలుస్తారని ఆయన చెప్పారు. సైన్యంలో ఎంపికకు సంబంధించి పాలనాపరమైన వత్తిళ్లు తగ్గించేందుకు ఈ సంస్కరణలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ సందర్భంగా మీడియాతోమాట్లాడిన మర్వాల్ ‘జైపూర్, అంబాలా, చెన్నై జోన్‌లలో ప్రయోగాత్మకంగా రాతపరీక్ష విధానం ప్రవేశపెట్టే యోచన ఉంది’ అని వెల్లడించారు. ఎంపిక ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ పద్ధతిలోనే జరుగుతుంది కాబట్టి ఎలాంటి అవకతవకలకు తావుండదని మేజర్ జనరల్ స్పష్టం చేశారు. రాతపరీక్ష తరువాత శారీరధారుడ్య పరీక్ష, మెడికల్ పరీక్ష ఉంటుందని ఆయన వివరించారు.