జాతీయ వార్తలు

నేనా.. రాష్టప్రతా? పెద్ద జోక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: వయసు మీద పడుతున్న కొద్దీ ఎవరికైనా అలుపన్నది సహజం. అయితే 74 ఏళ్ల వయసులో కూడా అమితాబ్ బచ్చన్‌లో అలాంటిదేమీ కనిపించదు. ఆయన ఇప్పటికీ సినిమాలు, రకరకాల కార్యక్రమాలతో ప్రతి రోజూ బిజీగా గడపడమే కాదు, హ్యూమర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఎదుటి వాళ్లు అడిగే ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పడమే కాదు, అందులో హాస్యం కూడా తొణికిసలాడుతూ ఉంటుంది. తాజాగా శనివారం హిందస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో పాల్గొన్న ఆయన ప్రయోక్త కరణ్ జోహార్‌తోపాటుగా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. దేశ రాష్టప్రతిగా ఉండమని మిమ్మల్ని అడిగితే ఏం చెబుతారని అడగ్గా, ‘నేనా రాష్టప్రతా? ఇది చాలాకాలంగా ఉన్న పెద్ద జోక్.. శత్రుఘ్న సిన్హా దీన్ని ప్రారంభించారు. నన్ను చూశారుగా.. నేనొక కామన్ మ్యాన్‌ను.. నాకు అర్హత లేదు. సామర్థ్యం లేదు.. నిజం చెప్పాలంటే తెలివితేటలు కూడా లేవు’ అని అమితాబ్ అన్నారు. సోషల్ మీడియా హవా నడుస్తున్న ఈ కాలంలో మీరు సినీ జీవితం ప్రారంభించి ఉంటే ఎలా ఉండేదని అడగ్గా, ‘ఈ రోజుల్లో ప్రతిదీ చాలావేగంగా జరిగిపోతూ ఉంటుంది. అదే స్థాయిలో ప్రతిస్పందనలూ వస్తుంటాయి. ఇది ఉపయోగకరంగా ఉందని నేను అనుకొంటున్నాను. మీరు కూడా విమర్శించవచ్చు ఆహ్లాదకరంగా’ అని అమితాబ్ అన్నారు. స్టార్‌డమ్ విషయంలో మీ అభిప్రాయం ఏమిటని అడగ్గా, ఇది నాది కాదు, మీ సమస్య అని ప్రేక్షకులను చూపిస్తూ అన్నారు. తాను ఏది కావాలనుకున్నానో అదంతా ఇచ్చింది ప్రజలేనని, స్టార్‌డమ్ కొల్పోవడం అనేది నిజంగా ఓ పీడకలేనని, అయితే ఈ విషయంలో తాను అదృష్టవంతుడినని అన్నారు.