జాతీయ వార్తలు

బిచ్చగాళ్లు కూడా స్వైపింగ్ వాడుతున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొరాదాబాద్, డిసెంబర్ 3: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో శనివారం జరిగిన బిజెపి పరివర్తన్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కాలంతోపాటుగా మనమూ మారాల్సిన అవసరం ఉందని, డిజిటల్ లావాదేవీలకు మళ్లక తప్పదని, ఓ బిచ్చగాడు స్వైపింగ్ మిషన్‌ను ఉపయోగిస్తున్నట్లుగా వాట్సాప్‌లో వచ్చిన ఓ వీడియోను ప్రస్తావించారు. ‘అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు.. అయితే వాట్సాప్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు కారులోని ఓ వ్యక్తిని డబ్బులు అడుగుతాడు. అయితే తాను సాయం చేయాలని అనుకున్నా తనవద్ద చిల్లర లేదని ఆ కారు యజమాని చెప్తాడు. వెంటనే బిచ్చగాడు తన సంచిలోంచి స్వైపింగ్ మిషన్ తీసి అతని డెబిట్ కార్డు అడుగుతాడు.. అదీ ఆ వీడియో’ అని ప్రధాని చెప్పగానే సభకు పెద్ద సంఖ్యలో హాజరైన జనం అంతా గొల్లుమని నవ్వేశారు. ఉద్దేశాలు సరయినవని భారతీయులకు నచ్చజెప్తే వారు కొత్తవాటిని అంగీకరించడానికి ఎక్కువ సమయం తీసుకోరని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు.