జాతీయ వార్తలు

దమ్ముంటే మహారాష్టక్రు రండి.. మీ మెడపై నేనే కత్తి పెడతా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 9: మజ్లిస్ పార్టీ నాయకులైన ఒవైసీ సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌పై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ థాకరే శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెడపై కత్తి పెట్టినప్పటికీ ‘్భరత్ మాతాకీ జై’ అనే నినాదం చేసే ప్రసక్తే లేదంటున్న అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లకు దమ్ముంటే మహారాష్టక్రు వచ్చి ఆ ప్రకటన చేయాలని సవాలు విసిరారు. అంతేకాకుండా అసదుద్దీన్, అక్బరుద్దీన్ మహారాష్టక్రు వస్తే వారి మెడపై తానే కత్తి పెడతానని రాజ్ థాకరే శనివారం ఇక్కడి శివాజీ పార్కులో ఎంఎన్‌ఎస్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ చేశారు. పనిలో పనిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ‘నమ్మక ద్రోహి’గా పేర్కొంటూ ఆయనపై కూడా నిప్పులు చెరిగారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమ భాగస్వామ్య పక్షమైన శివసేనకు తగిన గౌరవాన్ని ఇవ్వడం లేదని రాజ్ థాకరే పేర్కొంటూ, ఎన్‌డిఎ ప్రభుత్వం నుంచి వైదొలగాలని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకి హితవు పలికారు.
‘మంచి రోజులు’ ఏవి?
కేంద్రంలో అధికారాన్ని అప్పగిస్తే కేవలం 100 రోజుల్లోనే దేశ ప్రజలకు మంచి రోజులు తీసుకొస్తానని చెప్పిన నరేంద్ర మోదీ విదేశాల్లో ఎన్నో పర్యటనలు జరిపినప్పటికీ మంచి రోజులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ‘విదేశాల్లో భారతీయులు కూడబెట్టిన నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని మోదీ ఎన్నోసార్లు చెప్పారు. ఆ నల్లధనం ఏది? బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయల రుణాలను దండుకున్న విజయ్ మాల్యా ఆ సొమ్ముతో దేశంనుంచి పారిపోతే మోదీ ప్రభుత్వం ఏమి చేస్తోంది?’ అని రాజ్ థాకరే నిలదీశారు.