జాతీయ వార్తలు

శాంతిభద్రతలకు ఢోకా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించే ప్రమాదం ఉందన్న వాదనను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. సోమవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ‘శాంతి భద్రతలకు సంబంధించి సమస్యే లేదు. శాంతి భద్రతలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.
రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం రాత్రి తమిళనాడు గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుతో ఫోన్‌లో మాట్లాడి జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా శాంతి భద్రతలను పరిరక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు నిరంతరం తమిళనాడు ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకు శాంతి భద్రతల పరిస్థితి సాధారణంగానే ఉందని, రాష్ట్ర పాలనా యంత్రాంగానికి సహకరించడానికి తగినన్ని కేంద్ర బలగాలు అందుబాటులో ఉన్నాయని ఆ అధికారి వివరించారు. అవసరమైతే, హుటాహుటిన తమిళనాడుకు తరలించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో సిఆర్‌పిఎఫ్‌కు చెందిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్) సిబ్బంది 900 మందిని సిద్ధంగా ఉంచినట్లు ఆయన వెల్లడించారు.