జాతీయ వార్తలు

అసోం, బెంగాల్‌లో ముగిసిన ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి/ కోల్‌కతా, ఏప్రిల్ 9: అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ నెల 11న పోలింగ్ జరుగనున్న నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. అసోంలో ఈ రెండవ, చివరి విడతలో మిగిలిన 61 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 126 సీట్లున్న అసోం అసెంబ్లీలో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బిజెపి కూటమి గట్టిగా పోరాడుతోంది. పశ్చిమబెంగాల్‌లో సోమవారం పోలింగ్ జరుగనున్న 31 నియోజకవర్గాలలో ప్రచారం ముగిసింది. పశ్చిమ మిడ్నాపూర్, బంకురా, బర్ద్వాన్ జిల్లాల్లో ఉన్న ఈ నియోజకవర్గాలలో అనేక మంది ప్రతిపక్ష నాయకులు బరిలో ఉన్నారు. అసోంలో 525 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 1,04,35,271 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ 57, ప్రధాన ప్రతిపక్షమైన ఎఐయుడిఎఫ్ 47 సీట్లలో పోటీ చేస్తున్నాయి. బిజెపి 35, దాని మిత్రపక్షాలైన బిపిఎఫ్ 10, ఎజిపి 19 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో 21 మంది మహిళలు సహా మొత్తం 163 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సుమారు 70 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి టిఎంసి గట్టిగా కృషి చేస్తోంది. ఇదిలా ఉండగా, పోలింగ్ జరుగనున్న 8465 కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇలావుండగా తమిళనాడులో తిరిగి అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎఐఎడిఎంకె అధినేత్రి జయలలిత శనివారం ప్రకటించారు. జయలలిత శనివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన ఒక సభలో ప్రసంగించారు.