జాతీయ వార్తలు

అమర్‌నాథ్ యాత్రకు రికార్డు రిజిస్ట్రేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, ఏప్రిల్ 9: దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో వేంచేసిన అమర్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకునేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న భక్తులు లక్ష దాటారు. జూలై 2 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. దీనికోసం అడ్వాన్స్ రిజిస్ట్రేషన్లు లక్ష దాటాయని అమర్‌నాథ్ ఆలయ సిఇవో వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 432 పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలు, జమ్మూకాశ్మీర్ బ్యాంకు, యస్ బ్యాంకుల్లో అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేయించుకునే సదుపాయం కల్పించారు. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 32 రాష్ట్రాల్లో ముందస్తు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించినట్టు ఇసివో పికె త్రిపాఠి వెల్లడించారు. 48 రోజుల పాటు సాగే అమర్‌నాథ్ యాత్ర జూలై 2న ప్రారంభమై ఆగస్టు 18న రక్షాబంధన్ రోజుతో ముగుస్తుంది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే బల్తాల్, పహల్‌గావ్ రెండు మార్గాల నుంచి రోజుకు 7,500 మందిని అనుమతిస్తారు. యాత్రకు వచ్చేవారు ప్రభుత్వ వైద్యుడి నుంచి కచ్చితంగా హెల్త్ సర్ట్ఫికెట్ తీసుకోవాలని సిఇవో స్పష్టం చేశారు.