జాతీయ వార్తలు

‘నిట్’ను శ్రీనగర్‌నుంచి మార్చేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 9: శ్రీనగర్‌లోని ‘నిట్’ను కాశ్మీర్‌నుంచి వేరే చోటికి మార్చాలన్న బయటి రాష్ట్రాల విద్యార్థుల డిమాండ్‌ను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు తోసిపుచ్చారు. అయితే వారి న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. నిట్‌లో పరిస్థితిని చర్చించేందుకు విద్యాసంస్థలో చదువుతున్న బయటి రాష్ట్రాలకు చెందిన కొంతమంది విద్యార్థులు శుక్రవారం రాత్రి జమ్మూ, కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నరుూమ్ అఖ్తర్‌తో పాటుగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులను కలిశారు. అయితే నిట్‌ను కాశ్మీర్ వెలుపలకు మార్చాలన్న వారి డిమాండ్‌ను మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారని, ఆ విషయాన్ని విద్యార్థులకు చాలా స్పష్టంగా చెప్పారని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. అయితే క్యాంపస్ లోపల మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, చదువుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పించాలన్న వారి న్యాయమైన డిమాండ్లను తీరుస్తామని మంత్రులు, మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు విద్యార్థులకు హామీ ఇచ్చారని ఆ వర్గాలు తెలిపాయి. ఈ నెల 11న (సోమవారం) నిట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడం జరుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి. క్యాంపస్‌లో పరిస్థితి మెరుగుపడుతున్న సమయంలో ఈ సమావేశం జరగడం ఒక మంచి పరిణామం అని నిట్ అధికారి ఒకరు చెప్పారు. క్యాంపస్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉంది, అయితే బయటి రాష్ట్రాల విద్యార్థులు మాత్రం ఇప్పటికీ ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తోందని శ్రీనగర్ నిట్ రిజిస్ట్రార్ ఫయాజ్ అహ్మద్ మీర్ చెప్పారు. ఇళ్లకు వెళ్లాలనుకుంటున్న గాయపడిన కొంతమంది విద్యార్థులు పాలక మండలిని కలిశారని, కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వారిని ఇళ్లకు పంపించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఇళ్లకు వెళ్లాలనుకుంటున్న మిగతా విద్యార్థులు కూడా తమ వివరాలు సమర్పిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్యాంపస్‌లో మామూలు పరిస్థితులు నెలకొల్పడానికి, విద్యాసంస్థ సరికొత్త శిఖరాలకు చేరుకోవడానికి తోడ్పడాలని గవర్నర్ల బోర్డు చైర్మన్ ఎంజె జరబి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.
ఇలావుండగా, శ్రీనగర్ ఎన్‌ఐటిలో చదువుతున్న తమ పిల్లల భద్రత గురించి ఆందోళన చెందుతున్న రాజస్థాన్‌కు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆందోళనను తెలియజేయడానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలవాలని నిర్ణయించుకున్నారు. శ్రీనగర్ నిట్ క్యాంపస్‌లో పోలీసుల లాఠీచార్జికి నిరసనగా శుక్రవారం తల్లిదండ్రులు జైపూర్, కోటలో నిరసన ప్రదర్శనలు జరిపారు. విద్యార్థులను వారి సొంత ఊర్లకు పంపించి వేయాలని ప్రదర్శకులు డిమాండ్ చేశారు.