జాతీయ వార్తలు

ఇక కార్డే లార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: నగదు రహిత లావాదేవీల దిశగా కేంద్రం బలమైన అడుగు వేసింది. ప్రతి రంగంలోనూ కార్డు, ఆన్‌లైన్ చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు అనేక రాయితీలు, తాయిలాలు ప్రకటించింది. కార్డు ద్వారా చెల్లింపులు జరిపే వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం కీలక నిర్ణయాలు ప్రకటించారు. పెట్రోలు, డీజిల్, రైల్వే టికెట్ల కొనుగోలు నుంచి సాధారణ, జీవిత బీమా వరకూ మొత్తం 11 అంశాలపై డిస్కౌంట్ల వర్షం కురిపించారు. రెండు వేల రూపాయల వరకూ కార్డులపై జరిపే చెల్లింపులపై ఎలాంటి సేవా పన్ను ఉండదని కూడా జైట్లీ ప్రకటించారు. కార్డులు, ఈ వాలెట్, మొబైల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు జరిపే వారికి పెట్రోలు, డీజిల్ కొనుగోళ్లపై 0.75శాతం మేర డిస్కౌంట్ లభిస్తుందన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్న 4కోట్ల 32మంది రైతులకు రూపె కిసాన్ కార్డులు ఇస్తామని చెప్పారు. పది లక్షల జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రెండు పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలను సమకూరుస్తామని చెప్పారు. ప్రాధమిక సహకార సంఘాలు, పాల సౌసైటీలు, వ్యవసాయ సంబంధిత లావాదేవీలను డిజిటల్ పద్ధతిలో పెంపొందించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పోర్టళ్లు, కరెంట్ పాలసీల పునరుద్ధరణకు డిజిటల్ మార్గాన్ని అనుసరిస్తే జీవిత బీమాకు 8శాతం, సాధారణ బీమాకు పదిశాతం డిస్కౌంట్ లభిస్తుందన్నారు. అలాగే నెలవారీ, సీజనల్ సబర్బన్ రైల్వే టికెట్లను డిజిటల్ చెల్లింపుతో కొనుగోలు చేసే వారికి జనవరి 1 నుంచి 0.5శాతం రాయితీ లభిస్తుందన్నారు. రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే పది లక్షల వరకూ ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని, అలాగే రైల్వే కాటరింగ్, వసతి, విశ్రాంతి గదులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఐదు శాతం రాయితీ పొందవచ్చునన్నారు. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలతో ల ఆవాదేవీలను ఆన్‌లైన్‌లో జరిపే వారికి ఎలాంటి ఫీజులు ఉండవని, హైవే టోల్‌ను డిజిటల్ పద్ధతిలో చెల్లించినా పదిశాతం డిస్కౌంట్ అందిస్తామన్నారు. గత నెల 8 వరకూ అన్ని రకాల లావాదేవీలకు అత్యధిక స్థాయిలో నగదును, తక్కువ పరిమాణంలో డిజిటల్ చెల్లింపుల పద్ధతిని అనుసరిస్తూ వచ్చామని చెప్పిన జైట్లీ నగదు లావాదేవీల వల్ల అదనపు వ్యయ భారం ఆర్థిక వ్యవస్థపై పడుతుందన్నారు. డిజిటల్ చెల్లింపుల వల్ల కలిగే ప్రయోజనాలను విశదీకరించిన జైట్లీ నెల రోజుల్లో ఈ లావాదేవీలు 40శాతానికి పైగా పెరిగాయన్నారు. 30రోజుల వ్యవధిలో 4.5కోట్ల మంది వినియోగదారులు 1800కోట్ల రూపాయల మేర పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేశారని చెప్పారు. నిర్ణీత కాల వ్యవధిలో రిజర్వ్ బ్యాంక్ నగదును జారీ చేస్తోందని పేర్కొన్న ఆయన అన్నీ నగదుతోనే చేయాలంటే ప్రజాస్వామ్య వ్యవస్ధలో అంతర్గత వ్యయభారం అనివార్యమవుతుందన్నారు.

డిస్కౌంట్ల పట్టాలపై డిజిటల్

పెట్రోలు, డీజిల్‌పై 0.75శాతం
కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులకు రూపెకార్డులు
నెవారీ, సీజనల్ రైల్వే టికెట్లపై 0.5శాతం రాయితీ
ఆన్‌లైన్ రైల్వే టికెట్ బుకింగ్‌కు పదిలక్షల బీమా
టోల్ స్మార్ట్ కార్డులపై 10శాతం డిస్కౌంట్
రైల్వే కేటరింగ్, వసతికి 5శాతం రాయితీ
సాధారణ, జీవిత బీమాపాలసీలపై 8నుంచి 10శాతం డిస్కౌంట్
2వేల డిజిటల్ లావాదేవీలపై సేవాపన్ను మినహాయింపు

చిత్రం.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ