జాతీయ వార్తలు

దేశహితం కోసమే పెద్దనోట్ల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫతేపూర్, డిసెంబర్ 9: పెద్దనోట్ల రద్దు దేశప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు అనుకోని వరమేనని హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 500,1000 నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నవారంతా నల్లకుబేరులేనని శుక్రవారం ఇక్కడ జరిగిన పరివర్తన ర్యాలీలో ధ్వజమెత్తారు. ఇప్పటి వరకూ అవినీతి కార్యకలాపాలతో అక్రమార్జన చేసినవారి ఆటకట్టయిందని అందుకే రోజువారీగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. పెద్దనోట్ల రద్దును అత్యంత సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణిచిన ఆయన ఈ చర్య ద్వారా ప్రధాని మోదీ నల్లధనంపై యుద్ధ్భేరీ మోగించారని తెలిపారు. పెద్దనోట్ల రద్దు కారణంగా తలెత్తిన పరిస్థితులను అధిగమించాలని ప్రభుత్వానికి 50 రోజులు గడువు ఇవ్వాలని ప్రధాని మోదీ ముందే స్పష్టం చేశారని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. కఠినమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురైనా బలమైన చర్యలు తీసుకోక తప్పదని అన్నారు.