జాతీయ వార్తలు

మాజీ ఎయిర్ చీఫ్ త్యాగి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశంలోని ప్రముఖుల (వివిఐపిల) కోసం 3,600 కోట్ల రూపాయలతో హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) శుక్రవారం భారత వైమానికదళ మాజీ ప్రధానాధికారి ఎస్‌పి.త్యాగీని అరెస్టు చేసింది. 2007లో పదవీ విరమణ పొందిన త్యాగీని ఈ కేసులో సిబిఐ గతంలోనే తీవ్రంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులో త్యాగీతో పాటు అతని బంధువు సంజీవ్ అలియాస్ జూలీ త్యాగీ, న్యాయవాది గౌతమ్ ఖైతాన్‌ను కూడా సిబిఐ అరెస్టు చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. భారత వైమానిక దళానికి డజను ఎడబ్ల్యు-101 వివిఐపి హెలికాప్టర్లను సరఫరా చేసేందుకు ఫినె్మకానికాకు చెందిన బ్రిటిష్ అనుబంధ సంస్థ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వెనుక 423 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారడంతో పాటు ఈ ఒప్పందం విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం 2014 జనవరి 1వ తేదీన ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఈ కేసులో మరిన్ని ఆధారాలను సేకరించేందుకు వివిధ దేశాలకు న్యాయ పరమైన విజ్ఞప్తులు (లెటర్స్ ఆఫ్ రెగోరేటరీ) చేసిన విషయం విదితమే.