జాతీయ వార్తలు

కాకినాడ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్‌పల్లి, డిసెంబర్ 9: శంకర్‌పల్లి మండల పరిధిలోని రావులపల్లి రైల్వేస్టేషన్ వద్ద పట్టా విరిగిన సంఘటనలో శక్రవారం ఉదయం షిర్డీ నుండి కాకినాడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు, శంకర్‌పల్లి స్టేషన్ మాస్టర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షిర్డీ నుండి కాకినాడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ (వయా సికింద్రాబాద్) శుక్రవారం ఉదయం మండల పరిధిలోని రావులపల్లి స్టేషన్‌కు చేరకముందే పట్టా విరిగి పోయింది. విషయాన్ని గమనించకుండా అలాగే విరిగిన ఆ పట్టాపై నుండే ఇంజన్‌తో పాటు రెండు భోగీలు దాటగానే, గమనించి డ్రైవర్ రైలును ఆపారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఇంజనీరింగ్ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి పట్టాను మరమ్మతు చేశారు. అనంతరం నెమ్మదిగా మళ్లీ ట్రేన్‌ను పంపించారు. శంకర్‌పల్లికి 7.30గంటలకు రావలిన ఈ ఎక్స్‌ప్రెస్ 9గంటలకు వచ్చింది. సికింద్రాబాద్‌కు, హైదరాబాద్‌కు వెళ్లే తాండూరు ప్యాసింజర్, రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్, మెమో ప్యాసింజర్, బీదర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఇంటర్‌సిటీ రైళ్లు స్తంభించి పోవడంతో ఉద్యోగులు, ప్రయాణికులు, రోగులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. కొందరు ప్రయాణాన్ని రద్దు చేసుకోగా మరికొందరు బస్సులను ఆశ్రయించారు. తరచూ ప్యాసింజర్లను ఆపి ఎక్స్‌ప్రెస్‌లను వదలడంతో కోపంగా ఉన్న ప్రయాణికులు గొల్లగూడ స్టేషన్ మాస్టర్ పని తీరుపై మండిపడి గొడవ చేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రోజూ పట్టాలను తనిఖీ చేసి తగు జగ్రత్తలు తీసుకోవలసిన చెకింగ్ సిబ్బంది ఏమి చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఒకవేళ భారీ ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఉన్నాతాధికారులు ఈ విషయంలో అశ్రద్ధ వహించిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోపంగా డిమాండ్ చేస్తున్నారు.