జాతీయ వార్తలు

కాంగ్రెస్‌లో గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: పెద్ద నోట్లు రద్దయిన దగ్గర్నుంచీ కాంగ్రెస్‌లో గుబులు మొదలైంది. అవినీతి, అక్రమాలకు ఆలవాలమైన ఆ పార్టీ ప్రస్తుత పరిణామాలకు కంగారు పడటం సహజమేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా స్పందించారు. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి చిదంబరం ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో మంగళవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించి జైట్లీ ప్రతి విమర్శలు చేశారు, పెద్ద నోట్ల రద్దుతో పారిశ్రామికవేత్తలు, ధనవంతులకు మోదీ మేలు చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శిస్తే, ఇది అతి పెద్ద కుంభకోణమని, దర్యాప్తు జరపాలని చిదంబరం డిమాండ్ చేయడం తెలిసిందే. దీనికి జైట్లీ సమాధానమిస్తూ కాంగ్రెస్ హయాంలో జరిగినంత అవినీతి, అక్రమాలు ఇంకెప్పుడూ జరగలేదన్నారు. యూపీఏ పాలించిన పదేళ్లకాలంలో నల్లధనం నియంత్రణకు ఒక్క చర్యా తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ అవినీతికి 2జి, బొగ్గు కుంభకోణం, ఆగస్టా హెలికాప్టర్, కామన్‌వెల్త్ కుంభకోణాలు మచ్చుతునకలన్నారు. కుంభకోణాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు, ఎన్టీయే తీసుకున్న తాజా నిర్ణయం ఇబ్బంది కలిగిస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధివుంటే పార్లమెంట్‌లో నినాదాలతో సమయాన్ని వృధా చేయకుండా చర్చకు రావాలని కోరారు. దేశంలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి పెద్ద నోట్ల రద్దుతో మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్డీయే ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేస్తోందన్నారు.
బ్యాంకింగ్ రంగంలోవున్న వారితోపాటు, మరికొందరు పెద్ద నోట్ల రద్దును దెబ్బ తీసేందుకు కుట్ర పన్నారని జైట్లీ ఆరోపించారు. ప్రభుత్వం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అవినీతి, నల్లధనాన్ని నియంత్రించాలంటే నగదు రహిత వ్యవస్థను బలోపేతం చేయడం ఒక్కటే మార్గమన్నారు. డిజిటలైజేషన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దు ఇబ్బందులను ప్రభుత్వం నిత్యం సమీక్షిస్తోందని, మరోవైపు ఆర్బీఐ రోజూ పెద్ద మొత్తంలో నగదును మార్కెట్‌లోకి విడుదలు చేస్తోందని జైట్లీ వివరించారు. వచ్చే మూడు వారాల్లో మరింత నగదు చలామణిలోకి వస్తుందని, దీంతో వత్తిడి తగ్గి బ్యాంకుల ద్వారా పునఃచలామణి జరుగుతుందని వివరించారు. బ్యాంకులకు చేరిన నగదుకు లెక్కలు చూపించాల్సి ఉందని, దీన్నుంచి పన్ను వసూలు చేస్తారన్నారు. భవిష్యత్‌లో పన్ను చెల్లింపులు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో నగదు పెరుగుతోందని, దీనివల్ల తక్కువ వడ్డీకి రుణాలు అందుతాయన్నారు. నోట్ల మార్పిడిలో అవినీతికి పాల్పడున్న వారిపై నిఘా సంఘాలు కనే్నసి ఉంచాయని, వీరందరిపై చర్యలు తప్పవని జైట్లీ హెచ్చరించారు. అవినీతి, నల్లధనం నియంత్రణకు ప్రారంభిచిన పెద్ద నోట్ల రద్దు ఉద్యమానికి కాంగ్రెస్, ప్రతిపక్షాలు కలిసిరావాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు.