జాతీయ వార్తలు

ముస్లిం ఓటర్లలో చీలిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 21: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలో జరిగే ఎన్నికల్లో అధికార అన్నాడిఎంకెకు మద్దతు ఇవ్వాలా లేక డిఎంకెతో వెళ్లాలా తెల్చుకోలేని పరిస్థితి ముస్లిం పార్టీల్లో నెలకొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో ముస్లింలు ఆరుశాతం ఉన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత ఏర్పాటైన మానితానియా మక్కల్ కచ్చి (ఎంఎంకె) ప్రతిపక్ష డిఎంకె కూటమిలోకి వెళ్లే సూచనలున్నాయి. అయితే ఎంఎంకె అధికార పార్టీతోనే కొనసాగాలని ఎంఎంకె నేతలు భావిస్తున్నప్పటికీ ఆ పార్టీ నుంచి భరోసా లేకపోవడంవల్ల వైదొలగడం మంచిదన్న అభిప్రాయం వక్తం చేస్తున్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎంకె మూడుచోట్ల పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచింది. ఆ ఎన్నికల్లో అన్నాడిఎంకె కూటమిలోనే ఎంఎంకె ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో డిఎంకెతో ఎన్నికల పొత్తు పెట్టుకుని ఒక స్థానానికి పోటీ చేసి ఓటమిపాలైంది. ఎంఎంకె, ఇండియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్)లు డిఎంకెకు మద్దతును ఇచ్చాయి. మరోపక్క జయలలిత నాయకత్వంలోని అన్నాడిఎంకెకు తమిళ మానీలా ముస్లిం లీగ్, ఇండియన్ తౌహీద్ జమాత్ మద్దతుగా నిలిచాయి. ఎంఎంకె మద్దతువల్ల అన్నాడిఎంకెకు ముస్లిం వర్గంనుంచి పెద్దఎత్తున మద్దతు లభించింది. అయితే గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చిన జయలలిత వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఎంఎంకె నేత ఎంహెచ్ జవహిరుల్లా స్పష్టం చేశారు. ఎంఎంకె సీనియర్ నేత తమ్మెమున్ అన్సారీ అధినాయకత్వంపై తిరుగుబాటు చేసి గత నెలలో మానితానియా జననాయగ కచ్చి (ఎంజెకె) పేరుతో కొత్త కుంపటి పెట్టుకున్నారు. అప్పటినుంచి ఆయన డిఎంకెతో టచ్‌లోనే ఉన్నారు. ఈ నెల 26న చెన్నై ర్యాలీ తరువాత తుది నిర్ణయం తీసుకుంటారు. ఏదిఏమైనా రెండు ముస్లిం పార్టీలు డిఎంకెకు, మరో రెండు పార్టీలు అన్నాడిఎంకెకు మద్దతును ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లలో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది.