జాతీయ వార్తలు

ఇంఫాల్‌లో కర్ఫ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, డిసెంబర్ 18: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఆదివారం పలు ప్రజాసంఘాలు పాటించిన బంద్ హింసాత్మకంగా మారడంతోను, ఒక చర్చిపై దాడి జరిగిందన్న పుకార్లు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదికారులు నిరవధిక కర్ఫ్యూ విధించారు. పుకార్లు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఉండడానికి అధికారులు మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను సైతం నిలిపివేశారు. ఈ రోజు మధ్యాహ్నం విధించిన కర్ఫ్యూ తూర్పు ఇంఫాల్ జిల్లాలోని పోరోంపట్, సవోమ్‌బుంగ్ సబ్ డివిజన్లకు వర్తిస్తుందని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కొనసాగుతుందని ఓ అధికారిక ప్రకటన తెలిపింది. కాగా, శుక్రవారం మూడు పేలుళ్ల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా తయారవడంతో తూర్పు ఇంఫాల్ జిల్లాలో తక్షణం మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా నాగా తెగలు విధించిన ఆర్థిక నిర్బంధానికి, పోలీసులపై ఉగ్రవాదులు జరిపిన దాడులకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన బంద్ సందర్భంగా ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. యునైటెడ్ నాగా కౌన్సిల్ ఆర్థిక దిగ్బంధాన్ని ప్రకటించిన తర్వాత నవంబర్ 1నుంచి మణిపూర్‌లో నిత్యావసర వస్తువుల కొరతతో జనం ఇబ్బంది పడుతున్నారు.