జాతీయ వార్తలు

కొత్త ఆర్మీ చీఫ్ నియామకంపై రాజకీయ దుమారం గర్హనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 19: భారత సైనికదళ నూతన ప్రధానాధికారి నియామకంపై కొనసాగుతున్న రాజకీయ దుమారం అత్యంత గర్హనీయమని సైనికదళ మాజీ ప్రధానాధికారి, రిటైర్డ్ జనరల్ శంకర్ రాయ్‌చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. సైనికదళ ప్రధానాధికారిగా ఎవరిని ఎంపిక చేయాలో నిర్ణయించే అధికారం పూర్తిగా ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి అంశాలపై రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దురుద్దేశ్యపూరితంగా ఉంటున్నాయని, ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా రాజకీయ నాయకులను ఆపలేమని, ఇటువంటి దుమారాల్లోకి సైనికదళాన్ని లాగొద్దని వారికి చెప్పడం కూడా వ్యర్థమేనని ఆయన సోమవారం పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం దేశ సైనికదళ నూతన ప్రధానాధికారిగా లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్‌ను నియమించడం పట్ల చెలరేగిన వివాదం గురించి అడిగిన ప్రశ్నకు శంకర్ రాయ్‌చౌదరి పైవిధంగా స్పందించారు. ‘సైనికదళ ప్రధానాధికారిగా ఎవరిని ఎంపిక చేయాలో నిర్ణయించే అధికారం పూర్తిగా ప్రభుత్వానిదే. ఈ పదవి కోసం మీడియాలో ప్రముఖంగా పేర్లు వినిపించిన ముగ్గురూ (ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్, సదరన్ ఆర్మీ కమాండర్, సైనికదళ ఉప ప్రధానాధికారి బిపిన్ రావత్) అత్యుత్తములే’ అని శంకర్ రాయ్ చౌదరి పేర్కొన్నారు. రాజకీయ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు సైనికదళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయా? అని ప్రశ్నించగా, అటువంటిది ఏమీ ఉండదని, సైనిక దళం తన విధిని తాను కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.