జాతీయ వార్తలు

దళితులపై మొసలి కన్నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఏప్రిల్ 14: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దళితులు, వెనకబడిన వర్గాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ దళితుల పట్ల మొసలికన్నీరు కార్చడమే తప్ప వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన దాఖలాలే లేవని గురువారం ఇక్కడ ధ్వజమెత్తారు. సొంత సామాజిక వర్గం బిజెపికే ఆయనేమీ చేయలేకపోయారని మాయావతి ఎద్దేవా చేశారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ చెప్పుచేతల్లో మోదీ పరిపాలన సాగిస్తున్నారని ఆమె విమర్శించారు. టీ అమ్ముకుని ప్రధాని పదవికి ఎదిగానని పదేపదే చెప్పుకుంటున్న మోదీ నిజానికి బలహీన వర్గాల ప్రయోజనం కోసం చేసిందేమీ లేదని బిఎస్పీ అధినేత్రి స్పష్టం చేశారు.
రాజకీయ లబ్ధికోసమే పార్టీలు అంబేద్కర్ జపం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యర్థులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకొచ్చిన సమాజ్‌వాదీ పార్టీ అన్నిరంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని మాయావతి దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. యుపిఏ హయాంలో రైతులు, దళిత విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏనాడైనా విచారణకు డిమాండ్ చేశారా?అని ఆమె ప్రశ్నించారు. కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి దిక్కుతోచక కాంగ్రెసేతర పాలిత రాష్ట్రాలకు వెళ్లి డ్రామాలు ఆడుతున్నారని రాహుల్‌పై విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో హెచ్‌సియు దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతాన్ని ఆమె ప్రస్తావించారు. బిజెపి యూపీ శాఖ అధ్యక్షుడిగా నియమితుడైన కేశవ్ ప్రసాద్ వౌర్యపై బిఎస్పీ అధినేత్రి తీవ్ర ఆరోపణలు చేశారు, కేశవ్ నేరచరిత్ర ఉన్న నాయకుడని తెలిపారు. దళితుల నిజమైన దేవుడు అంబేద్కర్ అని ఆమె కొనియాడారు.
అంబేద్కర్ బాటలో నడవాలి: ఐరాస
ఐరాస: ప్రపంచం గర్వించదగ్గ మేధావి బిఆర్ అంబేద్కర్ అని ఐరాస శ్లాఘించింది. భారత్‌లో సామాజిక న్యాయం, సంస్కరణలు, సాధికారత, ఆర్థిక సమానత్వం కోసం మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా ఐరాసలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంబేద్కర్ బాటే అనుసరణీయమని, ఆయన మార్గంలో నడవడమే నిజమైన నివాళి అంటూ యుఎన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అడ్మినిస్ట్రేటర్ హెలెల్ క్లార్క్ పిలుపునిచ్చారు. బాబా సాహెబ్ పేదల పెన్నిధి అన్న క్లార్క్ ఆయన బోధనలు ప్రపంచానికే ఆదర్శంగా అభివర్ణించారు.కల్పనా సరోజ్ ఫౌండేషన్,్ఫండేషన్ ఆఫ్ హ్యూమన్ హ్యారిజోన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. యుఎన్‌డిపి తరఫున క్లార్క్ అధ్యక్షత వహించారు. సమాజంలో అసమానతలపై పోరాడిన మహానేత అంబేద్కర్ అని ఆమె శ్లాఘించారు.

చిత్రం లక్నోలో అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న బిఎస్పీ అధినేత్రి మాయావతి