జాతీయ వార్తలు

ప్రధాని ప్రకటించినవి అన్నీ వరాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: నోట్ల మార్పిడి వల్ల అనేక ప్రయోజనాలు జరిగాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయడు అన్నారు. ముఖ్యంగా మహిళలు, గ్రామీణులు, పేదలు, మధ్య తరగతి ప్రజలు, రైతులకు శనివారంనాడు ప్రధాని ప్రకటించిన ప్రోత్సాహకాలన్నీ సంక్షేమ పథకాలేనని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనను దేశం మొత్తం స్వాగతిస్తూంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పెద్దనోట్లు రద్దు నిర్ణయం వల్లన ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంక్షేమ పథకాలు, ప్రోత్సాహకాలు మొదట విడత ప్రయోజనాలుగా ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు. ప్రతిపక్షాలు నోట్ల రద్దు నిర్ణయాన్ని మొదట స్వాగతించి తర్వాత వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుబట్టారు. నిజాయితీగా ప్రభుత్వానికి పన్నులు కట్టేవారికి వేధింపులు వుండవని ప్రధాని ప్రకటించిన విషయాన్ని వెంకయ్య గుర్తుచేశారు. నోట్ల మార్పిడి వల్ల బ్యాంకులలోకి వచ్చిన అంతా తెల్లధనం కాదన్న ఆయన, ఎంత మొత్తంలో తెల్లధనం వచ్చింది, ఎంత మొత్తంలో నల్లధనం వచ్చింది? తేల్చే పనిలో సంబంధిత అధికారులు వున్నారని చెప్పారు.