జాతీయ వార్తలు

బలప్రయోగానికి వెనుకాడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: సరిహద్దుల వద్ద శాంతిని పరిరక్షించాలని దేశంతోపాటు సైనిక దళం కాంక్షిస్తోందని, ఇందుకోసం అవసరమైతే ఏ రూపంలో బలాన్ని ఉపయోగించేందుకైనా ఏమాత్రం వెనుకంజ వేసే ప్రసక్తే లేదని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆదివారం స్పష్టం చేశారు. తద్వారా ఆయన పాకిస్తాన్‌కు పరోక్ష హెచ్చరికలు పంపారు. సైనికదళ ప్రధానాధికారి పదవికోసం తనతోపాటు పోటీపడి చివరికి రేసులో వెనుకబడిన ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ భక్షి, సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పిఎం.హారిజ్ ఇకముందు కూడా తమ సేవలను కొనసాగిస్తూ సైనికదళ ఐక్యతను, పోరాట పటిమను పెంపొందించేందుకు తమవంతు సహకారాన్ని అందజేస్తారని ఆయన తెలిపారు. సైనికదళ 27వ ప్రధానాధికారిగా శనివారం బాధ్యతలు స్వీకరించిన బిపిన్ రావత్ ఆదివారం న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో సాయుధ బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సరిహద్దుల వద్ద శాంతిని పరిరక్షించాలని మన దేశం, సైనిక దళం ప్రగాఢంగా కాంక్షిస్తున్నాయి. అంటే మనం బలహీనులమని అర్థం కాదు. అన్ని విధాలుగా మనం ఎంతో శక్తిసామర్థ్యాలను పుణికిపుచ్చుకున్నాం. అవసరమైతే మనం ఏ రూపంలో బలాన్ని ఉపయోగించేందుకైనా వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. సరిహద్దుల వద్ద శాంతిని పరిరక్షించాలన్నదే మన ప్రధాన లక్ష్యం. అయినప్పటికీ మరోసారి చెబుతున్నా.. అవసరమైతే ఏ రూపంలో బలాన్ని ఉపయోగించేందుకైనా మనం వెనకడుగు వేసేది లేదు’ అని తేల్చిచెప్పారు. పాకిస్తాన్‌తో మన దేశం 749 కిలోమీటర్ల పొడవైన నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సహా 3,323 కిలోమీటర్ల సరిహద్దును కలిగివున్న విషయం తెలిసిందే. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తూ, నియంత్రణ రేఖ వెంబడి తరచుగా దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ గత ఏడాది జమ్మూ-కాశ్మీరులో 60 మందికి పైగా భారత సైనికుల ప్రాణాలను బలితీసుకున్న నేపథ్యంలో బిపిన్ రావత్ ఈ విషయాలను స్పష్టం చేశారు. సైనికదళ ప్రధానాధికారిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలేమిటో తెలుసని, ఆయుధాలు, సేవలతో నిమిత్తం లేకుండా సైనికులంతా తనకు సమానులేనని, దేశానికి ఎనలేని సేవలను అందిస్తూ సైనిక దళాన్ని మరింత బలోపేతం చేస్తున్న ప్రతి జవానూ తనకు ముఖ్యుడేనని ఆయన పేర్కొన్నారు.

చిత్రం..ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆదివారంనాడు అమర్ జవాన్ జ్యోతికి
వందనం సమర్పణ చేస్తున్న ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్