జాతీయ వార్తలు

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: పెట్రోలు, డీజిలు ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు రూ.1.29 పెరగ్గ, డీజిలు ధర లీటరుకు 97 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రినుంచే అమలులోకి వస్తాయని చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి. పెరిగిన ధరల తర్వాత హైదరాబాద్‌లో పెట్రోలు లీటరు స్థానిక పన్నులతో కలుపుకొని రూ 74.90గా ఉంటుంది. డీజిలు ధర లీటరు రూ. 62.71గా ఉంటుంది. గత నెల 17న కూడా పెట్రోలు, డీజిలు ధరలను పెంచిన విషయం తెలిసిందే. కాగా, వంటగ్యాస్ సిలిండర్ ధర కూడా 2 రూపాయలు పెరిగింది. 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 432.71గా ఉండగా, ఇప్పుడది రూ. 434.71కి పెరుగుతుంది. సబ్సిడీ భారాన్ని తగ్గించువడానికి వంటగ్యాస్ సిలిండర్ ధరను స్వల్ప మొత్తాల్లో పెంచాలని ప్రభుత్వం గత జూలైలో నిర్ణయించినప్పటినుంచి సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది ఎనిమిదోసారి. గతంలో డీజిల్ ధరను కూడా ప్రభుత్వం ఇలాగే చిన్న మొత్తాల్లో ప్రతి నెలా పెంచిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు వంటగ్యాస్, కిరోసిన్ ధరలను కూడా ప్రతి నెలా కొద్దికొద్దిగా పెంచుతూ వస్తున్నారు.