జాతీయ వార్తలు

కనుచూపులో ఆవాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: కొత్త ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 44కోట్ల మందికి పక్కా ఆవాసాలు కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. వీరికి కల్పించే ఆవాసాలకు విద్యుత్, మంచినీరు, ఎల్‌పిజి కనెక్షన్లనూ సమకూరుస్తామని తెలిపింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోచన పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమచేస్తామని తెలిపింది. మైదానపు ప్రాంతా ల్లో ఉన్న వారికి లక్షా 30వేలు, కొండ ప్రాంతాల్లో ఉండే వారికి లక్షన్నర సమకూరుస్తామని గ్రామీణ అభివృద్ధి విభాగం కార్యదర్శి అమర్‌జిత్ సిన్హా తెలిపారు. అదనంగా లబ్ధిదారులకు టాయ్‌లెట్ల నిర్మాణం కోసం 12వేల రూపాయలు ఇస్తామని, అలాగే ఎమ్‌ఎన్‌ఆర్‌ఇజిఎ కింద 90రోజుల ఉపాధినీ కల్పిస్తామని తెలిపారు. దీని వల్ల మరో 18వేల రూపాయలు వారికి సమకూరుతాయన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 33కోట్ల మందికి అన్ని కనెక్షన్లతో ఆవాసాలు కల్పించాలని భావించామని, ఇప్పుడు వారి సంఖ్యను 44కోట్లకు పెంచామని అమర్‌జిత్ సిన్హా వెల్లడించారు. ప్రజలకు పక్కా ఆవాసాలను కల్పించడం ద్వారా నాణ్యత, ప్రామాణికతతో కూడిన జీవనాన్ని అందించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఇళ్లు లేని వారికి ఆవాసాలను కల్పించడం, కచ్చా ఇళ్లలో ఉన్నవారికి పక్కా ఆవాసాన్ని అందించాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు. ఇళ్లులేని వారి పేరిట స్థలాన్ని బదిలీ చేయాలని ఇప్పటికే రాష్ట్రాలను కోరడం జరిగిందన్నారు. తాము ఆవాసాలను కల్పించాలనుకుంటున్న లబ్ధిదారుల్లో 60శాతం మంది షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందినవారేనని ఆయన తెలిపారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక, ధృవీకరణ ప్రక్రియ పూర్తయిందన్నారు. ప్రత్యక్ష లబ్ధి బదిలీ పద్ధతిలోనే ఈ పథకం అమలు అవుతుందని, నిర్దేశిత మొత్తాన్ని మూడేళ్లలో దశలవారీగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగానే జమచేస్తామని అన్నారు. ఈ నిధులను ఇతరత్రా మళ్లించకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని, అంతా పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. జాబితాలో ఉన్న వారికే ఈ లబ్ధి చేకూరేలా చూస్తామని, ప్రతి ఇంటి ముందు లబ్ధిదారుడి ఫొటో ఉంచుతామని తెలిపారు. స్ధానిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగానే ఈ ఆవాసాల నిర్మాణం జరుగుతుందని వెల్లడించిన అమర్‌జిత్ సిన్హ ఇందుకోసం 30వేల మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తీసుకునే రుణాలపై నాలుగు శాతం వడ్డీ సబ్సిడీని ప్రధాని మోదీ తన నూతన సంవత్సర ఉపన్యాసంలో వెల్లడించిన విషయం తెలిసిందే.