జాతీయ వార్తలు

చిన్నమ్మ సిఎం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 2: అన్నాడిఎంకె పగ్గాలు చేపట్టిన శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న డిమాండ్ పార్టీలో ఊపందుకుంటోంది. పార్టీ, ప్రభుత్వం ఒకరి చేతిలో ఉంటేనే సమర్థవంతమైన పాలన లభిస్తుందని అన్నాడిఎంకె సీనియర్ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ, ప్రభుత్వం ఒకే వ్యక్తి దగ్గర ఉంటే క్రమశిక్షణతోపాటు ప్రజలకు సుపరిపాలన అందుతుందని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ‘యూపీలో ఏం జరుగుతోందో చూడండి. తండ్రి ములాయం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. కుమారుడు అఖిలేష్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సిఎంకు పార్టీపై పట్టులేకపోవడం వల్లే అక్కడ సమస్యలు తలెత్తాయి’ అని తంబిదురై పేర్కొన్నారు. పోయెస్ గార్డెన్‌కు వెళ్లి పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను కలిసిన తంబిదురై ఓ వినతి పత్రం అందజేశారు. సిఎం పదవి చేపట్టాలని ఆయన శశికళకు విజ్ఞప్తి చేశారు. చిన్నమ్మ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించిన డిప్యూటీ స్పీకర్ తన డిమాండ్‌లో న్యాయం ఉందని చెప్పుకొచ్చారు.