జాతీయ వార్తలు

పోరుకు సన్నద్ధం.. శాంతికే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: ఇటు పాకిస్తాన్, అటు చైనాలను ఏకకాలంలో ఎదుర్కోవడానికి తాము సన్నద్ధంగా ఉన్నామని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ ఉద్ఘాటించారు. అయితే చైనాతో సంఘర్షణ కంటే కూడా సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలపైనే దృష్టిపెడతామని అన్నారు. మొత్తం చైనాలోని లక్ష్యాన్నైనా చేధించగలిగే 5వేల కిలోమీటర్ల పరిధి కలిగిన అగ్ని-5 అణు క్షిపణి పరీక్షపై చైనా వ్యాఖ్యాలను ఆయన ప్రస్తావించారు. సైనిక దళాలకు సంబంధించినంత వరకూ ఎలాంటి పరిణామాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్న ఆయన, ‘ఈ విషయంలో రాజకీయ అధినాయకత్వం ఆదేశాలను శిరసావహిస్తాం’ అని స్పష్టం చేశారు. ఉత్తర సరిహద్దు ప్రాంతంలో సామరస్యపూర్వక సంబంధాలను పెంపొందించుకునేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. అదేవిధంగా వాస్తవాధీన రేఖ ప్రాంతంలో నిరంతరం ఘర్షణలకు తావులేని రీతిలో శాంతియుత సంబంధాలను కొనసాగించడమే లక్ష్యమని అన్నారు. వాస్తవాధీన రేఖ ప్రాంతంలో తాజాగా జరిగిన సమావేశ ఉద్దేశం కూడా ఇదేనని అన్నారు.