జాతీయ వార్తలు

అగ్ని-4 పరీక్ష విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాసోర్ (ఒడిశా), జనవరి 2: భారత్ అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. అణుపదార్థాలను మోసుకెళ్తూ నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించగలిగే సామర్థ్యం గల ఈ వ్యూహాత్మక క్షిపణిని ఒడిశా తీరంలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్ (వీలర్ ఐలాండ్) వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్)కు చెందిన లాంచ్ కాంప్లెక్స్-4 నుంచి మొబైల్ లాంచర్ సాయంతో ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాన్ని ఛేదించగలిగే ఈ అగ్ని-4 క్షిపణిని ఉదయం 11.55 గంటలకు విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) వర్గాలు తెలిపాయి. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-4 క్షిపణిని పరీక్షించడం ఇది ఆరోసారని ఆ వర్గాలు వెల్లడించాయి. గతంలో చివరిసారిగా 2015 నవంబర్ 9న భారత సైన్యానికి చెందిన ప్రత్యేకంగా ఏర్పడిన స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ (ఎస్‌ఎఫ్‌సి) నిర్వహించిన అగ్ని-4 పరీక్ష కూడా విజయవంతమయింది. కాగా, సోమవారం పరీక్షించిన అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి గమనాన్ని పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి ఒడిశా తీరం వెంట రాడార్లను, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు డిఆర్‌డిఒ వర్గాలు తెలిపాయి. అగ్ని-4 క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి లక్షిత ప్రాంతానికి సమీపంలో భారత నావికాదళానికి చెందిన రెండు నౌకలను లంగరు వేసి ఉంచారు. అగ్ని-1, 2, 3, పృథ్వి వంటి బాలిస్టిక్ క్షిపణులు ఇప్పటికే భారత సాయుధ బలగాల అమ్ముల పొదిలో చేరి ఉన్నాయి.