జాతీయ వార్తలు

నోట్ల రద్దుతో చితికిపోయాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాల్దా, జనవరి 2: గత రెండు నెలలుగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అతలాకుతలం అయిపోయిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరోక్షంగా తప్పుబట్టారు. ఒకప్పుడు పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉన్న పశ్చిమ బెంగాల్, పెద్దనోట్ల రద్దు కారణంగా సమస్యల కూపంలో చిక్కుకుపోయిందని అన్నారు. ప్రధాని మోదీ చెబుతున్న నగర రహిత సమాజ ఆలోచనను తిప్పికొట్టిన మమత, అటు అమెరికాలో కాని, ఇటు జర్మనీలో గాని నూటికి నూరు శాతం నగదు రహిత లావాదేవీలు లేవని అన్నారు. కాని భారతదేశంలో 92 శాతం మేర బ్యాంకులే లేవని, అటాంటప్పుడు నగదు రహిత సమాజ స్థాపన ఎలా సాధ్యమవుతుందన్నారు. రాజకీయ నాయకులు ఎట్టి పరిస్థితులను సామాన్యులను వేధించడాన్ని పనిగా పెట్టుకోకూడదని అన్నారు. దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ఉందని, నియంతలకు ఆస్కారమే లేదని స్పష్టం చేసిన ఆమె, తాజా విపత్తు నుంచి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇటు పరిశ్రమలను, అటు ఉద్యోగాలను పెంపొందించుకోవడమే ఇందుకు ఏకైక మార్గమని, ఎక్సైడ్ పరిశ్రమలకు చెందిన ఒక ఫ్యాక్టరీని ప్రారంభించిన సందర్భంగా మమత అన్నారు.

చిత్రం..హాల్దాలో సోమవారం ఎక్సైడ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్న మమత