జాతీయ వార్తలు

అవన్నీ యుపిఏ పథకాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 2: నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన పథకాలను బిజెపి మిత్రపక్షం శివసేన ఎద్దేవా చేసింది. యుపిఏ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలనే మార్చి ప్రకటించారని ప్రధానిపై విరుచుకుపడ్డారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజల అవస్థలు పడుతుంటే పరిష్కారం చూపలేకపోయారని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో విమర్శించారు. తమ సమస్యలకు ప్రధాని ప్రసంగంతో ఓ పరిష్కారం దొరుకుతుందని ప్రజలు ఆశిస్తే మోదీ అసలు పట్టించుకోలేదని సేన ఆరోపించింది. నోట్లకోసం ఎటిఎంల వద్ద క్యూల్లో నిలబడి సుమారు 400 మంది మృతి చెందారని పార్టీ ధ్వజమెత్తింది. మరణాలన్నింటికీ కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని సామ్నా విరుచుకుపడింది.