జాతీయ వార్తలు

మేమేం చేయలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున తాము విచారణ జరపలేమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్ విచారణకు సుప్రీకోర్టు అనుమతి తీసుకురావాలని ట్రిబ్యునల్ సూచించింది. సోమవారంనాడు పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రేలా అనే స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్జీటి గతంలో కోరిన విధంగా సుప్రీంకోర్టులో పోలవరంపై దాఖలైన పిటిషన్ల వివరాలను పిటిషనర్ తరపు న్యాయవాదులు అనుప్ బోంబాని, శ్రవణ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణ జాగృతి సంస్థలతోపాటు కోదండరాం తదితరులు దాఖలు చేసిన పిటిషన్ల వివరాలను తెలిపారు. ఈ పిటిషన్లన్నీ దాదాపు పనె్నండేళ్లుగా సుప్రీం కోర్టులో పెడింగ్‌లో ఉన్నాయని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ జరపడానికి సుప్రీం కోర్డు అనుమతి తీసుకురావాలని ఎన్జీటి సూచించింది లేదా పోలవరం నిర్మాణంలో జరుగుతున్న పర్యావరణ ఉల్లంఘనలపై తాజాగా పిటిషన్ దాఖలు చేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ సూచించింది. ఈ మేరకు నెల రోజుల గడువు మంజూరు చేస్తూ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.