జాతీయ వార్తలు

సవాళ్లే... అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 3: శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎప్పటికప్పుడు తలెత్తుతున్న సవాళ్లనే అవకాశాలుగా మార్చుకుని భారత్ ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో సృజనాత్మక జిజ్ఞాస దేశవ్యాప్తంగా విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ రంగాల్లో భారతావని అద్వితీయంగా రాణించాలంటే బాల్యదశలోనే పిల్లల్లో పరిశోధనాసక్తి, అవగాహనను పెంపొందించాలన్నారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకునే విధంగా వ్యవస్ధను తీర్చిదిద్లాన్నారు. అత్యుత్తమ శిక్షణతో పోటీ ప్రపంచంలో దూసుకెళ్లేలా దేశ యువతను తీర్చిదిద్దేందుకు చేతులు కలపాలంటూ మంగళవారం నాడిక్కడ 104వ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన సందర్భంగా స్పష్టం చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత తరహాలోనే శాస్త్ర సామాజిక బాధ్యత (ఎస్‌ఎస్‌ఆర్)ను పెంపొందించాలని దీని వల్ల విద్యా సంస్థలు సహా అన్ని రంగాలూ ప్రతిభాయుతంగా రాణించగలుగుతాయన్నారు. విచ్ఛిన్న టెక్నాలజీలపై దృష్టి పెట్టాలని శాస్తవ్రేత్తల్ని కోరిన మోదీ సృజనకు పెద్దపీట వేసే అన్ని రంగాలకూ తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కొత్త ఆలోచనలు, సృజనాత్మక శక్తి బీజాలను బాల్య దశలోనే స్కూలు పిల్లల్లో వేయడం వల్ల భారత దేశ శాస్ర్తియ పరిశోధనా పునాధి విస్తరిస్తుందని, దేశ భవితా దేదీప్యమవుతుందని అన్నారు. పిల్లలకు తగిన శిక్షణ ఇచ్చే విధంగా జాతీయ లేబరేటరీలు స్కూళ్లు,కాలేజీలతో అనుసంధానం కావాలని స్పష్టం చేశారు. వీటి శిక్షణతో పిల్లలు భవిష్యత్ సవాళ్లకు సన్నద్ధం కాగలుగుతారన్నారు.క్షణక్షణానికీ మారుతున్న ఆధునిక ప్రపంచ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని దృష్టిలో ఉంచుకుని స్ధానిక అవసరాలకు అనుగుణంగా జనహితానికి తోడ్పడే నూతన ఆవిష్కరణలపై శాస్తవ్రేత్తలు దృష్టి పెట్టాలన్నారు. ఈ దిశగా సాగే పరిశోధనలకు తోడ్పడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాలపై దిశానిర్దేశం చేసిన మోదీ గతేడాది నవంబర్ 26న ప్రముఖ శాస్తవ్రేత్త ఎన్.జి.మీనన్ మృతిచెందడాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ మీ అందరి సమక్షంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరోసారి నివాళులు తెలియజేస్తున్నానని అన్నారు. అంతకుమునుపు పలువురు నోబెల్ గ్రహీతలకు ఆయన పురస్కారాలు అందజేశారు. ఎస్వీయూ రూపొందించిన సావనీర్‌ను గవర్నర్, ముఖ్యమంత్రితో కలసి ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ శాస్తవ్రేత్తలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి ఎనలేనిదని, ఇందుకు తాను వారిని అభినందిస్తున్నానన్నారు. అనేక సవాళ్ళు ఎదుర్కొంటూ పరిశోధనలో ముందుకు వెడుతున్న శాస్తవ్రేత్తల సృజనాత్మకతను, శక్తి సామర్థ్యాలను దేశం గౌరవిస్తోందన్నారు. అయితే నేటి ప్రపంచ వ్యవస్థలో నెలకొంటున్న తాజా పరిణామాలను అధ్యయనం చేస్తూ అందుకు అనుగుణంగా జన హితానికి తోడ్పడే నూతన శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు నాంది పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా పరిశోధనలు సాగాలన్నారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని అందించడానికి తమ ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందన్నారు. నేడు ప్రపంచదేశాల శాస్తస్రాంకేతిక రంగాల అభివృద్ధిలో భారత్ ఆరో స్థానంలో ఉందన్నారు. 2030 నాటికి ప్రపంచంలో సాంకేతిక రంగాల్లో అత్యుత్తమ దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచేలా నూతన పరిశోధనలకు శ్రీకారం చుట్టాలన్నారు. యూనివర్శిటీలు, ఐ ఐ టిలు ఒకేమాట, బాటతో పరిశోధనలో ముందుకు సాగాలన్నారు. ఎన్‌ఆర్‌ఐ పిహెచ్‌డి విద్యార్థుల సేవలనూ వినియోగించుకోవాలని అన్నారు. భవిష్యత్తులో కూడా శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి పునాదులు ఉండేలా విద్యార్థిదశ నుంచే విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి కలిగేలా ప్రభుత్వం ప్రాధాన్యత పెంచుతుందని అన్నారు. ఇందులో బాగంగానే 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. పరిశోధన, శిక్షణ తదితర రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. నేడు పర్యావరణం, నీటి శుద్ధి రంగాలు కీలకంగా మారాయన్నారు. అయితే నేడు అనేక రంగాల్లో సమస్యలు ఉన్నాయని అన్నారు. అయితే తక్షణం 12 కీలక రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్, రోబోటిక్ రంగాల్లో అధునికతను భారతదేశం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నొక్కివక్కాణించారు. కేంద్రం ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా ద్వారా ఉత్పత్తి రంగం వేగం అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నామన్నారు. వ్యవసాయం, విద్య, సాంకేతికత, వౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అయితే నేడు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరిన్ని కొత్త ఆవిష్కరణలను తీసుకురావాల్సిన బాధ్యత శాస్తవ్రేత్తలపై ఉందని ప్రధాని మోదీ అన్నారు. వాతావరణ మార్పులు, ప్రస్తుత సాంకేతిక అంశాలపై అప్రమత్తంగా ఉండాలని కూడా మోదీ శాస్తవ్రేత్తలకు హితవు పలికారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఐ టి ఐ, స్టార్టప్‌లు, మంత్రిత్వశాఖలు సమన్వయంగా పనిచేసి పురోగతి సాధిస్తే 2030 నాటికి ప్రపంచంలోని అగ్రదేశాల సరసన భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని అన్నారు. శాస్తస్రాంకేతిక రంగాలకు, పరిశోధన సంస్థలకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని వివరించారు. నేడు అంతరిక్ష రంగంలో భారత్ ఉన్నత శిఖరాలను అధిరోహించిందన్న ప్రధాని, దేశ శాస్త్ర సాంకేతిక రంగాలు మరింతగా వికసించేందుకు నీతి ఆయోగ్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల ఆలోచనలు మదింపు చేయాలన్నారు. గ్రామీణ,పట్టణ అంతరాలను పూడ్చేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమ్మిళిత అభివృద్ధి కోసం పరిశోధన-అభివృద్ధిపై శాస్తవ్రేత్తలు దృష్టి పెట్టాలన్నారు. పట్టణాల్లో సైన్స్ టెక్నాలజీ హబ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఆలోచనలను పంచుకోవడానికి వేదికలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్థానిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలన్నారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి పెంచుకోవాలన్నారు. పరిపాలనలో జియో ఇన్ఫర్మేషన్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్రజా,ప్రైవేట్ భాగస్వామ్యం పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. విధ్వంసాలకు సాంకేతికతను ఉపయోగించడంపట్ల అప్రమత్తంగా ఉండాలని శాస్తవ్రేత్తలను ప్రధాని హెచ్చరించారు.

చిత్రం..సైన్స్ కాంగ్రెస్ వేదికపై నోబెల్ పురస్కారం గ్రహీత ప్రొఫెసర్ సెర్జ్ హరోక్‌ను సత్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు