జాతీయ వార్తలు

కేసుల మోత.. జడ్జీల కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: దేశ వ్యాప్తంగా న్యాయమూర్తుల కొరత, పెండింగ్ కేసులు పెరిగిపోవడం పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత సమాజం సమీకృత లక్షణాన్ని కాపాడుకునేందుకు భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లకు న్యాయవ్యవస్థ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టు ప్రాంగణంలో మంగళవారం వీడ్కోలు ప్రసంగం చేసిన చీఫ్ జస్టీస్ అనేక అంశాలను ప్రస్తావించారు. దేశ వ్యాప్తంగా దాదాపు మూడు కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో పడిపోయాయని గుర్తు చేశారు. తగిన పరిమాణంలో న్యాయమూర్తులు లేని దృష్ట్యా వీటిని సమర్ధమైన రీతిలోనే ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. తగిన వౌలిక సదుపాయాలు కూడా కొరవడిన పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థకు అన్ని వైపులా సవాళ్లేనన్నారు. సమీప భవిష్యత్‌లోనే అత్యంత తీవ్రమైన ఎన్నో అంశాలు ముందుకు రావచ్చునని, సైబర్ చట్టాలు, మెడికో లీగల్ కేసులు, ప్రైవసీ, జెనిటిక్స్ ఇలా ఎన్నో సంక్లిష్టమైన అంశాలు పరిశీలనకు వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా భారత్‌ను సమీకృత సమాజంగా పరిరక్షించాల్సిన బాధ్యతకు సంబంధించిన అంశాలూ తెరపైకి రావచ్చునన్నారు. ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు భారత్‌కు ఎంతో అవకాశం ఉందని ఉద్ఘాటించిన చీఫ్ జస్టీస్ అభివృద్ధి, ప్రగతిలో భాగంగా తలెత్తే సవాళ్లను సమర్ధంగా ఎదుర్కొనేందుకు న్యాయ వ్యవస్ధ సిద్ధంగా ఉండాలని లేని పక్షంలో భారత్ ముందుకు సాగజాలదన్నారు. న్యాయమూర్తి కావాలనో లేదా సీనియర్ న్యాయవాది కావాలనో న్యాయవాదుల మధ్య పోటీ ఉండకూడదన్నారు. ఈ పదవులన్నవి వాటంతట అవే రావాలి తప్ప వాటి కోసం పాకులాడకూడదన్నారు. వీటిని పొందేందుకు తగిన అర్హతలను సంపాదించడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు.

చిత్రం..పదవీ విరమణ సభలో చీఫ్ జస్టిస్ ఠాకూర్‌ను సత్కరిస్తున్న న్యాయ ప్రతినిధులు. చిత్రంలో కాబోయే చీఫ్ జస్టిస్ కెహెర్ తదితరులు