జాతీయ వార్తలు

ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్, మార్చి 21: హింసాకాండను విడనాడితే ఈశాన్య భారత మిలిటెంట్ల గ్రూపులతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడానికి ముందుకు వస్తుందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఆయుధాలు వీడే ఏ గ్రూపుతోనైనా కేంద్రం శాంతి చర్చలు జరుగుతుందని పేర్కొన్న ఆయన, హింసాకాండను చర్చాబాట పెట్టాలని తీవ్రవాదులకు విజ్ఞప్తి చేశారు. ఈశాన్య భారత మిలిటెంట్లతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఎన్‌ఎస్‌సిఎన్-ఐఎన్, ఉల్ఫా తదితర తీవ్రవాద సంస్థలతో కేంద్రం చర్చలు జరుగుతోంది. అయితే కొన్ని తీవ్రవాద గ్రూపులు శాంతి చర్చలకు విరుద్ధంగా హింసాకాండకు పాల్పడడంతో హోంమంత్రి మరోసారి పిలుపునిచ్చారు.