జాతీయ వార్తలు

ఈశాన్య భారతాన్ని కుదిపేసిన భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తల, జనవరి 3: త్రిపుర సహా పలు ఈశాన్య రాష్ట్రాలను స్వల్పస్థాయి భూకంపం మంగళవారంనాడు కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. త్రిపురలో అనేకచోట్ల దీని ప్రభావానికి కొండచరియలు విరిగిపడ్డాయ. ఈ సంఘటనలో ఒకరు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారు. భూకంప తీవ్రత మాత్రం ప్రజలను భయకంపితులను చేసిందని, భయంతో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు పెట్టారు. రాష్ట్రంలోని ధలాల్ జిల్లాలోని అనేక మారుమూల ప్రాంతాల్లో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అగర్గలకు 59 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని, భూమికి 29 కి.మీ లోతులో ఇది సంభవించినట్లుగా ప్రాంతీయ భూకంప పరిశోధనా కేంద్రం వెల్లడించింది. మేఘాలయలో కూడా కొన్ని క్షణాలపాటు భూకంపం సంభవించిందని, అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అస్సాం రాజధాని గౌహతితోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కనిపించిందని, ముఖ్యంగా త్రిపుర సరిహద్దును ఆనుకుని ఉన్న అన్ని జిల్లాలోని ప్రజలు భయంతో పరుగులు తీశారని కథనాలు వెలువడ్డాయి.