జాతీయ వార్తలు

అవసరమైతే మరిన్ని లక్షిత దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌పై మరోసారి లక్షిత దాడులు జరిగే అవకాశం లేకపోలేదని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా పాక్‌కు బలమైన సందేశం ఇవ్వడానికి మరింత తీవ్రస్థాయిలోనే లక్షిత దాడులు చేసే అవకాశం లేకపోలేదని రావత్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో శాంతిభద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తామంటూ రెండు రోజుల క్రితమే ప్రకటించిన రావత్ అవసరమైతే మరిన్ని లక్షిత దాడులను చేపట్టేందుకు వెనుకాడేది లేదని చెప్పడం గమనార్హం. సైనిక దళానికి చెందిన అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఎప్పటికప్పుడు వీటి పని తీరును తాను పరిశీలిస్తున్నానని ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో రావత్ తెలిపారు. ముగ్గురు సీనియర్ అధికారులను పక్కనబెట్టి భారత సైనిక దళాల 27వ చీఫ్‌గా కేంద్రం రావత్‌కు పట్టం కట్టిన విషయం తెలిసిందే. మిగతా వారందరికంటే కూడా సరిహద్దుల్లో ఎదురవుతున్న సవాళ్లను గట్టిగా ఎదుర్కోవడానికి రావత్ తగిన వ్యక్తి కాబట్టి ఆయనకే పట్టం కట్టడం జరిగిందని కేంద్రం స్పష్టం చేసింది.