జాతీయ వార్తలు

సీనియారిటీయే సర్వస్వం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: కొత్త ఆర్మీ చీఫ్ ఎంపికలో సీనియారిటీని విస్మరించారంటూ వచ్చిన విమర్శలను రక్షణ మంత్రి పారికర్ తిరస్కరించారు. సీనియారిటీ ప్రకారమే పదవులు కట్టబెట్టాలంటే ఆ పనిని కంప్యూటర్లే చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. జన్మించిన తేదీ ఆధారంగా వివరాలను ఫీడ్ చేస్తే ఆర్మీ చీఫ్‌లను ప్రభుత్వం నియమించక్కర్లేదని, కంప్యూటర్ లెక్కల ప్రకారమే నియామక ప్రక్రియ జరిగిపోతుందని వ్యంగ్యంగా అన్నారు. అంతేకాదు, ఈ పద్ధతినే అనుసరిస్తే ఆయా వ్యక్తుల అర్హతలకు సంబందించి మల్లగుల్లాలు పడాల్సిన అవసరమే లేదని, కేబినెట్ కమిటీ సమావేశాలను నిర్వహించాల్సిన పనే ఉండదని అన్నారు. సైనిక దళాల్లో నియామకాలు ఆయా వ్యక్తుల సమర్థత, ప్రావీణ్యం, అర్హతల ఆధారంగానే జరుగుతాయని, తాజా నియామకం విషయంలోనూ జాప్యం జరగడానికి కారణం మిగతా అభ్యర్థుల అర్హతలను తులనాత్మకంగా అధ్యయనం చేయడానికేనని పారికర్ వివరించారు.