జాతీయ వార్తలు

17 వరకూ శేఖర్‌రెడ్డికి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 3: ఇసుక మాఫీయా డాన్ జె శేఖర్‌రెడ్డి మరో నలుగురికి ఈ నెల 17 వరకూ జుడీషియల్ రిమాండ్ విధించారు. రెడ్డి నివాసం నుంచి నగదు స్వాధీనంపై తాజాగా మరో కేసు నమోదైంది. వెంకట్‌నారాయణన్ రోడ్‌లోని నివాసం నుంచి దర్యాప్తు అధికారులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకు ముందు 170 కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం దొరికింది. ఈ కేసును సిబిఐ న్యాయమూర్తి విజయలక్ష్మి 11వ సిబిఐ కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. టిటిడి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి అతడి అనుచరుల బ్యాంక్ ఫ్రాడ్ కేసులు 11వ కోర్టులు బదలిచేయాలని సిబిఐ కోరింది. కాగా బెయిల్ కోసం శేఖర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ కోర్టు డిసెంబర్ 30 కొట్టివేసింది. నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలన్న సిబిఐ విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయమూర్తి తోసిపుచ్చారు. తాజాగా రెడ్డి మరో నలుగురికి జుడీషియల్ కస్టడి విధిస్తూ 11వ సిబిఐ కోర్టు న్యాయమూర్తి వెంకటసామి ఆదేశాలిచ్చారు. శేఖర్‌రెడ్డి నివాసం, కార్యాలయంపై ఐటి అధికారులు నిర్వహించిన దాడుల్లో 127 కిలోల బంగారం, 170 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది.