జాతీయ వార్తలు

వంటగ్యాస్‌పై ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: వంటగ్యాస్ సిలిండర్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసి, చెల్లింపులు జరిపే కస్టమర్లకు ఇప్పుడు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి సిలిండర్‌పైనా రూ.5 రూపాయల రాయితీని ఇవ్వనున్నాయి. కస్టమర్లు వంటగ్యాస్ సిలిండర్లను వెబ్ బుకింగ్ చేసే సమయంలోనే నెట్‌బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులు లాంటి ఆన్‌లైన్ పద్ధతుల్లో చెల్లింపులు జరపవచ్చు. అలా చేసినప్పుడు కస్టమర్ల మొబైల్ ఫోన్ స్క్రీన్లపై డిస్కౌంట్ తర్వాత ఎంతమొత్తం చెల్లించాలో డిస్‌ప్లే అవుతుంది. వంటగ్యాస్ సిలిండర్ హోమ్ డెలివరీ చేసే సమయంలో ఇచ్చే క్యాష్ మెమోలో సైతం డిస్కౌంట్ తర్వాత చెల్లించాల్సిన మొత్తం ఉంటుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ లక్ష్యం నెరవేరడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ ప్రోత్సాహకాన్ని ఇస్తున్నాయి.