జాతీయ వార్తలు

బిఎస్పీ కులతత్వ పార్టీకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 3: కులాల ప్రాతిపదికన ఓటేయవద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం యుపి ఓటర్లను కోరిన ఒక రోజు తర్వాత రాష్ట్ర ఎన్నికల్లో తన ఓటమిని మోదీ అంగీకరించినట్లు కనిపిస్తోందని బిఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం అన్నారు. అంతేకాదు బిఎస్పీ కులతత్వ పార్టీ అన్న ఆరోపణలను సైతం ఆమె తోసిపుచ్చారు. నోట్ల రద్దు వ్యవహారంపై కూడా ప్రధానిపై ధ్వజమెత్తిన మాయావతి విదేశాల్లో దాచిపెట్టిన నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంతోసహా ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీల్లో 25 శాతం కూడా ఆయన అమలు చేయలేకపోయారని, అందుకే పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. ‘తన ఓటమిని, యుపిలో తమ పార్టీ అధికారంలోకి రాదనే విషయాన్ని ఆయన అంగీకరించినట్లుగా సోమవారం లక్నోలో ప్రధాని చేసిన ప్రసంగం ఉంది. ఈ ఎన్నికలు విజయం కోసమో లేదా అధికారం కోసమో పోరాడడం లేదని ఆయన పదే పదే చెప్పడమే కాకుండా బాధ్యత గురించి మాట్లాడారు’ అని మాయావతి మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. నిన్న లక్నోలో జరిగిన బిజెపి ర్యాలీలో ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు మోదీ ముఖాలు కళ తప్పినట్లు కనిపించాయని వారు మాట్లాడిన తీరు, వారు చేస్తున్న ప్రకటనలు యుపిలో వారు అధికారంలోకి రావడం లేదనే విషయాన్ని చెప్తున్నాయన్నారు.
రాజకీయ కుట్రలో భాగంగానే బిఎస్పీని కులతత్వ పార్టీ అని అంటున్నారని మాయావతి ఆరోపించారు. ‘బిఎస్పీ కులతత్వ పార్టీ అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మిగతా కులాలవారు దానికి ఓటేయకుండా ఉండడానికి అవి అలా ఆరోపిస్తున్నాయి. ఇది వాళ్ల రాజకీయ కుట్ర’ అని ఆమె అన్నారు. అధికారంలో ఉండిన నాలుగుసార్లు కూడా బిఎస్పీ దళితులే కాకుండా అన్ని కులాల ప్రయోజనాలకోసం పని చేసిందని ఆమె చెప్పారు. అంతేకాదు, ఆర్థిక ప్రాతిపదికన ఉన్నత కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలని తమ పార్టీ పార్లమెంటు లోపల, వెలుపలా డిమాండ్ చేసిందని కూడా ఆమె చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తాము సమాజంలోని అన్ని వర్గాలకు టికెట్లు ఇచ్చామని తాజా ఉదాహరణ రుజువు చేస్తోందని ఆమె చెప్పారు. కులాల వారీగా టికెట్ల వివరాలను ఆమె వివరిస్తూ అసెంబ్లీలోని మొత్తం 403 స్థానాల్లో 85 సీట్లను ఎస్సీలకు రిజర్వ్ చేశామని, 87 టికెట్లు దళితులకు ఇచ్చామని చెప్పారు. ముస్లింలకు 97, ఒబిసిలకు 103, ఉన్నత కులాలకు 113 (బ్రాహ్మణులకు 66, క్షత్రియులకు 36, కాయస్థులు, వైశ్యులు, పంజాబీలకు 11) సీట్లు ఇచ్చినట్లు చెప్పారు. తాను చాలా రోజుల క్రితమే అభ్యర్థులను నిర్ణయించానని, అందులో ఎలాంటి మార్పూ చేయలేదని, అయితే జాబితాను తర్వాత విడుదల చేస్తామని మాయావతి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తు ఉండబోదని కూడా ఆమె స్పష్టం చేశారు.